ఆడిష‌న్స్ కు ద‌ర్శ‌కులు ఎలాంటి ప్రామాణికాలు పాటిస్తారు?

సినిమా, వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో కాస్టింగ్ అత్యంత కీలకమైన ఘట్టం. ఒక పాత్రకు సరైన నటుడిని ఎంచు కోవడంపైనే ప్రాజెక్ట్ సగం విజయం ఆధారపడి ఉంటుంది.

Update: 2026-09-05 12:30 GMT

సినిమా, వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో కాస్టింగ్ అత్యంత కీలకమైన ఘట్టం. ఒక పాత్రకు సరైన నటుడిని ఎంచు కోవడంపైనే ప్రాజెక్ట్ సగం విజయం ఆధారపడి ఉంటుంది. ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు దర్శకులు కేవలం నటనను మాత్రమే కాకుండా అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. పాత్ర స్వభావం, రూపం, విజువల్స్ వంటి వివిధ కోణాల్లో అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అంతిమ నిర్ణయం తీసుకుంటారు.

దర్శకుడు ఆడిషన్‌లో గమనించే మొదటి ప్రామాణికం లుక్ అండ్ పర్సనాలిటీ. కథలో రాసుకున్న పాత్ర రూపానికి, వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు నటుడి రూపం సరిపోతుందో ?లేదో? చూస్తారు. దీనికోసం కాస్ట్యూమ్‌లు, మేకప్‌తో లుక్ టెస్ట్ చేస్తారు. నటుడి హావభావాలు, నడక, శరీర భాష ఆ పాత్ర ఆత్మకు దగ్గరగా ఉన్నాయో? లేదో? దర్శకులు ప్రధానంగా పరిశీలిస్తారు.

ఆడిషన్ సమయంలో అభ్యర్థికి ఒక సన్నివేశం లేదా డైలాగ్ ఇచ్చి నటించమని కోరతారు. పాత్రలోని భావోద్వేగాలను (సంతోషం, కోపం, బాధ, భయం మొదలైనవి) ఎంత సహజంగా పలికిస్తున్నారనేది చూస్తారు. ముఖంలో పలికే సూక్ష్మ భావాలు , డైలాగ్స్ చెప్పే తీరు, సీన్ మోడ్యులేషన్ , కళ్ల భాష ఆధారంగా నటుడి ప్రతిభను అంచనా వేస్తారు.

కథ నేపథ్యం ప్రకారం పాత్ర మాట్లాడే భాష, యాస చాలా ముఖ్యం. నటుడి గొంతులో ఉన్న స్పష్టత , డైలాగ్ డెలివరీలో చూపే టైమింగ్, ఉచ్ఛారణ పద్ధతిని దర్శకులు గమనిస్తారు. ఒకే డైలాగ్‌ను రకరకాల ఎమోషన్స్‌తో చెప్పించి నటుడి వాయిస్ మోడ్యులేషన్‌ను భాషపై ఉన్న పట్టును పరీక్షలు చేస్తారు.

కెమెరా ముందు నటుడు ఎంత సౌకర్యవంతంగా ఉంటున్నాడు? ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉందనేది? కీలకమైన అంశం. ముఖ్యంగా ప్రధాన పాత్రల మధ్య అనుబంధాన్ని పరిశీలించడానికి కెమిస్ట్రీ టెస్ట్ చేస్తారు. తోటి నటీనటులతో కలిసి నటిస్తున్నప్పుడు వారి స్పందన ఎంత సహజంగా ఉందో? దర్శకుడు ప్రామాణికంగా తీసుకుంటారు.

నటనతో పాటు నటుడి క్రమశిక్షణ, ప్రవర్తనకు దర్శకులు ప్రాధాన్యతనిస్తారు. సెట్‌లో ఇచ్చే సూచనలను నటుడు ఎంత త్వరగా అర్థం చేసుకుని అనుకరిస్తున్నాడో చూస్తారు. స్పాట్‌లో అనుకోకుండా సీన్ మార్చాల్సి వస్తే సమయస్ఫూర్తితో ఎలా నటిస్తున్నారనేది, దర్శకుడి విజన్‌కు అనుగుణంగా మారే నమ్యత ఉందో లేదో సరిచూసుకుని తుది ఎంపిక చేస్తారు.

న‌టుల విష‌యంలో మేక‌ర్స్ ఏమాత్రం సంతృప్తి చెంద‌క‌పోయినా నిర్మోహ‌మాటంగా తిరస్క‌రిస్తారు. అక్క‌డ మాత్రం ఎలాంటి రాజీ ఉండ‌దు. బాలీవుడ్ లో ఈ రూల్ క‌చ్చితంగా పాటిస్తారు. మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల్లోనూ దాదాపు ఇలాగే ఉంటుంది. అయితే ఆ ప్ర‌భావం బాలీవుడ్ రేంజ్ లో మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల్లో పెద్ద‌గా క‌నిపించ‌దు. ఆడిష‌న్ అనంత‌రం బాలీవుడ్ లో ప్ర‌త్యేకంగా వ‌ర్క్ షాపులు కూడా నిర్వ‌హిస్తారు.

Tags:    

Similar News