ఆ స్టార్ హీరో భర్త కంటే మంచి ఎక్స్-హజ్బెండ్!

అంతేకాదు ఆమిర్ ఖాన్ మాజీ భార్యల వ్యక్తిగత నిర్ణయాలను, వారి స్వతంత్ర గుర్తింపును ఎల్లప్పుడూ గౌరవిస్తారని అమీన్ అన్నారు.

Update: 2026-09-05 08:30 GMT

మిస్టర్ పర్‌ఫెక్ట్ నిస్ట్ ఆమిర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావులతో ఎంతటి ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తారో? తెలిసిందే. వైవాహిక జీవితానికి స్వస్తి ప‌లికినా? వారి మధ్య ఉన్న గౌరవం, ప్రేమాభిమానాలు ఎప్పటికీ మారవని ఆమీర్ సన్నిహితుడు, నటుడు, రచయిత అమీన్ హాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయ‌ప‌డ్డారు. సిద్ధార్థ్ కన్నన్‌తో జరిపిన సంభాషణలో అమీన్ - ఆయన భార్య షార్లెట్ ఆమిర్ ఖాన్ కుటుంబ జీవితం - ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆమిర్ ఖాన్‌కు పూర్వ భార్యలతో ఉన్న బంధం గురించి మాట్లాడే క్రమంలో `నేను భర్తగా కంటే మంచి ఎక్స్-హజ్బెండ్ గా బాగా పనిచేస్తాను` అని ఆమిర్ ఖానే సరదాగా జోక్ చేస్తుంటారని అమీన్ హాజీ గుర్తు చేసుకున్నారు. వివాహబంధం ముగిసినా? ఆమిర్ మాజీ భార్యల పట్ల చూపించే ఆప్యాయత, గౌరవం ఏమాత్రం తగ్గలేదని షార్లెట్ పేర్కొన్నారు. ఆమిర్ కుటుంబంలో ఉన్న అనుబంధాలు ఏవీ నాటకీయమైనవి కావు అని, వారి మధ్య స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉందనడానికి వారి కలిసి ఉన్న వాతావరణమే నిదర్శనమని తెలిపారు.

అంతేకాదు ఆమిర్ ఖాన్ మాజీ భార్యల వ్యక్తిగత నిర్ణయాలను, వారి స్వతంత్ర గుర్తింపును ఎల్లప్పుడూ గౌరవిస్తారని అమీన్ అన్నారు. రీనా దత్తా విడాకుల తర్వాత కూడా తన పేరును, మతాన్ని మార్చుకోలేదని, ఆ నిర్ణయాన్ని ఆమిర్ ఎంతో గౌరవించారని వెల్లడించారు. అలాగే ఏ మహిళ గురించి కూడా ఆమిర్ ఎప్పుడూ చౌకబారుగా .. ప్రతికూలంగా మాట్లాడరని ఎవరైనా అలా మాట్లాడినా వెంటనే వారించి గౌరవప్రదంగా నడుచుకోవాలని సూచిస్తారని అమీన్ కొనియాడారు.

ఆమిర్ ఖాన్ త‌న స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఇచ్చే మద్దతును అమీర్ గుర్తు చేసుకుంటూ ఒక విచిత్రమైన సంఘటనను పంచుకున్నారు. అమీన్ హాజీ దర్శకుడిగా మారిన తొలి చిత్రం `కోయీ జానే నా` చిత్రీకరణ సమయంలో నాకు నటుడి మద్దతు అవసరమైంది. విషయం తెలిసిన ఆమిర్ స్వయంగా ఫోన్ చేసి ఆ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించడానికి ముందుకొచ్చారని తెలిపారు. `ఒకవేళ నా సొంత తమ్ముడు ఫైసల్ ఖాన్ ఇలాంటి పరిస్థితిలో ఉంటే నేను ఎలా సహాయం చేస్తానో? నీకు కూడా అలాగే చేస్తున్నాను అని ఆమిర్ చెప్పిన మాటలు ఎంతో భావోద్వేగానికి గురి చేశాయని అమీన్ గుర్తు చేసుకున్నారు.

సామాజిక మాధ్యమాలు, బాక్సాఫీస్ ఫలితాల వల్ల వచ్చే విమర్శలను ఆమిర్ ఎదుర్కొనే విధానంపై కూడా అమీన్ భార్య షార్లెట్ ప్రశంసలు కురిపించారు. `లాల్ సింగ్ చద్దా` చిత్రం విడుదలైన సమయంలో ఎన్నో విమర్శలు, ప్రతికూల ప‌రిస్థితులు ఎదురైనప్పటికీ ఆమిర్ తనలోని సానుకూల దృక్పథాన్ని కోల్పోలేదని తెలిపారు. ఎదుటి వ్యక్తుల్లోని లోపాలను వెతకడం కంటే వారిలోని మంచి గుణాలను మాత్రమే చూడటం ఆమిర్ నైజమని, ఎంతటి చేదు అనుభవాలు ఎదురైనా? మనుషులతో ఉన్న సంబంధాలను తెంచుకోరని అన్నారు.

ఆమిర్ ఖాన్ కేవలం తన మాటలతోనే కాదు. తన చేతల ద్వారా ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలిచారని అమీన్ హాజీ అభిప్రాయపడ్డారు. `లగాన్` చిత్రంలో బాఘా పాత్ర ద్వారా ఆమిర్‌తో ప్రారంభమైన తన స్నేహం `స్వదేస్` రచన బృందంలో పనిచేసే వరకు కొనసాగిందన్నారు. ప్రతి ఒక్కరికీ ఆమిర్ లాంటి సోదరుడు, ఒక గురువు లభించాలని ఆకాంక్షిస్తూ తోటి వారిని నమ్మడం, మళ్లీ మళ్లీ ప్రేమించడం వంటి గుణాలు ఆమిర్ ఖాన్ లోని గొప్పతనాన్ని చాటి చెబుతాయని అమీన్ ముగించారు.

Tags:    

Similar News