మినిమల్ లుక్‌తో నభా నటేష్ స్టన్నింగ్ అప్పియరెన్స్!

టాలీవుడ్ ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నభా నటేష్ తాజాగా షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Update: 2026-09-05 08:06 GMT

టాలీవుడ్ ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నభా నటేష్ తాజాగా షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. "ఓన్లీ ద జెంట్లెట్ డ్రీమ్స్ మే పాస్" అనే పోయెటిక్ క్యాప్షన్‌తో ఆమె పోస్ట్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మినిమల్ లుక్‌తో, ఎంతో ప్రశాంతమైన భంగిమలో ఆమె కనిపిస్తున్న తీరు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. గ్లామర్‌కు గ్రేస్ జోడిస్తూ నభా ఇచ్చిన ఈ పోజులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.ఆ విశేషాలు చూద్దాం..




బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ లుక్:

తాజా ఫోటోషూట్‌లో నభా నటేష్ క్లాసిక్ బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ను ఎంచుకున్నారు. పెద్ద విండో పక్కన నిలబడి, చేతులను ముఖం దగ్గరకు తెచ్చి ఎంతో ప్రశాంతంగా, గ్రేస్‌ఫుల్‌గా పోజులు ఇచ్చారు. ఇక ఎటువంటి హంగులు లేకుండా చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ, ఆమె నుంచి వస్తున్న రాయల్ వైబ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.




స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో నభా మెరుపులు:

ఈ ఫోటోషూట్ కోసం నభా ఆఫ్-షోల్డర్ బ్లాక్ బాడీకాన్ మినీ డ్రెస్ ధరించారు. ఈ ఫిట్టెడ్ అవుట్‌ఫిట్, అసిమ్మెట్రిక్ నెక్ లైన్, లాంగ్ స్లీవ్స్ ఆమెకు మరింత గ్లామరస్ అండ్ స్టైలిష్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. ఇక కలర్ ఫుల్ డ్రెస్‌ల కంటే ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లోనే ఆమె అందం మరింత ప్రశాంతంగా, మెరిసిపోతూ కనిపిస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ తో క్రేజ్ :

ఇక ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా, రామ్ పోతినేనితో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’లో చాందిని పాత్రతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడంతో అందరూ ఆమెను ప్రేమగా ‘ఇస్మార్ట్ బ్యూటీ’ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, మాస్ట్రో వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు.

గాయం తర్వాత గ్రాండ్ రీఎంట్రీ:

మధ్యలో ఒక చిన్న ప్రమాదం వల్ల గాయపడిన నభా నటేష్, కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే పూర్తి కోలుకున్న తర్వాత ‘డార్లింగ్' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తన వర్సటైలిటీని నిరూపించుకుంటున్నారు.

చేతినిండా క్రేజీ ప్రాజెక్టులు:

ప్రస్తుతం నభా నటేష్ చేతిలో కొన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో పాన్-ఇండియన్ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ రిలీజ్ అయ్యి హిట్ అందుకుంది. ఇక పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘స్వయంభు’ లో నటిస్తుంది .ఇక ఈ మూవీ లో పార్వతి వంటి వైవిధ్యమైన పాత్రల్లో ఆమె కనిపించబోతున్నారు.

ఇక తన నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో సరికొత్త ఫ్యాషన్ లుక్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే నభా నటేష్, ఈ మినిమల్ ఫోటోషూట్‌తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇక రాబోయే పెద్ద ప్రాజెక్టులతో సౌత్ ఇండస్ట్రీలో ఆమె మరింత ఎత్తుకు ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News