పాన్ ఇండియా స్టార్ తర్వాత ఏంటి?

ఇలా ఒక సినిమా విజయంతో హీరోకు వచ్చే గుర్తింపు.. కేవలం స్టార్‌ అనే పదాన్ని దాటి ‘పాన్ ఇండియా స్టార్‌ అనే స్థాయికి చేరింది. కానీ ఇప్పుడు ఆ పదం కూడా కామన్ గా మారుతోంది.

Update: 2026-09-05 13:30 GMT

టాలీవుడ్‌ లో హీరోలకు ట్యాగ్స్ కొత్తేమీ కాదు. ఒకప్పుడు తమ ఫేవరెట్ హీరోను ప్రత్యేకంగా గుర్తించేందుకు ఇచ్చే ఆ పేర్లు.. మెల్లగా వారి ఇమేజ్‌ లో భాగమయ్యాయి. మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌, రెబల్‌ స్టార్‌ వంటి ట్యాగ్స్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల కాలం. హీరోల మార్కెట్‌ ఒక భాషకే పరిమితం కావడం లేదు. దీంతో కొత్త తరహా ట్యాగ్స్ కూడా తెరపైకి వస్తున్నాయి.

ఒకప్పుడు ఒక హీరో తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్‌ సంపాదించాడన్నదే ప్రధానంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా ఒకేసారి పలు భాషల్లో విడుదలవుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ అసోసియేషన్లు ఏర్పడుతున్నాయి. సోషల్‌ మీడియా ద్వారా హీరోల పేరు ప్రపంచవ్యాప్తంగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్‌ పదం ఎక్కువగా వినిపించడం మొదలైంది.

ఇలా ఒక సినిమా విజయంతో హీరోకు వచ్చే గుర్తింపు.. కేవలం స్టార్‌ అనే పదాన్ని దాటి ‘పాన్ ఇండియా స్టార్‌ అనే స్థాయికి చేరింది. కానీ ఇప్పుడు ఆ పదం కూడా కామన్ గా మారుతోంది. వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రతి హీరోను పాన్ ఇండియా స్టార్‌గా పిలవడం మొదలైతే.. ఆ పదానికి ఉన్న స్పెషాలిటీ తగ్గిపోతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది.

పాన్ ఇండియా తర్వాత హీరోల ట్యాగ్స్ ఏ స్థాయికి వెళ్తాయి? ఇప్పటికే కొందరు హీరోలకు గ్లోబల్ స్టార్‌, ఇంటర్నేషనల్ స్టార్‌ వంటి పదాలు వినిపిస్తున్నాయి. ఫ్యూచర్ లో సినిమాలు హాలీవుడ్‌ సహా మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరిస్తే.. ఇలాంటి ట్యాగ్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ట్యాగ్స్ ఎంత మారినా.. వాటి వెనుక నిజమైన స్టార్‌ డమ్‌ ఉండాలి. ఒక సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైనంత మాత్రాన హీరోను గ్లోబల్ స్టార్‌ గా పిలవడం సరిపోదు.

ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్రేక్షకుల రెస్పాన్స్, మార్కెట్‌, సినిమా ఎఫెక్ట్ వంటి అంశాలు కూడా ఉండాలి. ఇప్పటి సోషల్‌ మీడియా కాలంలో హీరో పేరు కూడా ఒక బ్రాండ్‌ గా మారుతోంది. సినిమా అనౌన్స్మెంట్స్ నుంచి టీజర్‌, ట్రైలర్‌, పాటలు, ప్రమోషన్స్‌ వరకు ప్రతిచోటా హీరో ఇమేజ్‌ కీలకంగా మారింది. దీంతో కొత్త ట్యాగ్స్ సృష్టించడం కంటే.. ఉన్న స్టార్‌ బ్రాండ్‌ ను మరింత నిర్మించడంపై దృష్టి పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు.. అభిమానుల్లో ట్యాగ్స్ పై ఎమోషనల్ ఎక్కువగా ఉండటంతో చిన్న మార్పు కూడా చర్చకు దారితీస్తోంది.

ఒక హీరోకు ఏ టైటిల్‌ సరిపోతుంది? మరో హీరోకు ఏ బిరుదు ఉండాలి? అనే చర్చలు సోషల్‌ మీడియాలో తరచూ కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్‌ తర్వాత మరో పెద్ద ట్యాగ్ రావచ్చు. ఆ తర్వాత ఇంకో కొత్త పదం పుట్టొచ్చు. కానీ ఏ టైటిల్‌ అయినా ప్రేక్షకుల నుంచి గుర్తింపు పొందినప్పుడే ఎక్కువ కాలం నిలుస్తుంది. ఎందుకంటే హీరోకు స్టార్‌ డమ్‌ ఇచ్చేది ట్యాగ్ కాదు.. అతడి సినిమాలే. అందుకే ఫ్యూచర్ లో ట్యాగ్స్ ఎంత మారినా.. ప్రేక్షకుల మనసులో నిలిచేది మాత్రం హీరో సాధించిన విజయాలే.

Tags:    

Similar News