ప్రేక్షకుల పల్స్ పై రాజమౌళికి అప్పుడే అంత నమ్మకమా?
సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అనే విషయం ముందే చెప్పడం చాలా కష్టం. కథ విన్నప్పుడు ఒకలా అనిపించినా, తెరపైకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్ మరోలా ఉండొచ్చు.
సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అనే విషయం ముందే చెప్పడం చాలా కష్టం. కథ విన్నప్పుడు ఒకలా అనిపించినా, తెరపైకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్ మరోలా ఉండొచ్చు. అందుకే చాలామంది దర్శకులు, నిర్మాతలు ప్రేక్షకుల టేస్ట్ అంచనా వేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే కొందరు దర్శకులు మాత్రం తమ ఆలోచనపై పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్తారు. అలాంటి వారిలో రాజమౌళి పేరు ముందుంటుంది.
ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా భారీ స్థాయిలో రూపొందుతున్న తన కొత్త చిత్రం వారణాసితో బిజీగా ఉన్న రాజమౌళి.. ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన ఓ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ప్రేక్షకుల పల్స్ అర్థం చేసుకోవడంలో తనకు అప్పటినుంచే ఎంత నమ్మకం ఉందో ఆయన మాటలు మరోసారి గుర్తు చేశాయి. రాజమౌళి కెరీర్ ను పరిశీలిస్తే ప్రేక్షకుల పల్స్‌ను అంచనా వేయడంలో ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది.
సాధారణంగా హీరోలను ఒకే తరహాలో చూపించే సమయంలో ఆయన కొత్త యాంగిల్స్ వెతుకుతుంటారు. ప్రేక్షకులు ఏ ఎమోషన్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతారో, ఏ సీన్ ఎక్కువ ప్రభావం చూపుతుందో ముందే అంచనా వేసి కథను రూపొందిస్తారని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతుంటారు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి చిత్రాలను చూసినా ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. నార్మల్ స్టోరీలకు కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడం రాజమౌళి స్పెషాలిటీగా మారింది.
ముఖ్యంగా ఎమోషన్స్, హీరో ఎలివేషన్లు, కథలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఎలా ప్రభావితం చేస్తాయో ఆయనకు మంచి అవగాహన ఉందనే అభిప్రాయం పరిశ్రమలో ఉంది. అందుకే రాజమౌళి మూవీ అంటే ఆడియన్స్ లో ముందుగానే ఆసక్తి ఏర్పడుతుంది. కథ ఏంటో తెలియకపోయినా, ఆయన చూపించే విధానం మీద ప్రేక్షకులు నమ్మకం పెంచుకున్నారు. ప్రతి సినిమాలో కొత్తదనం ఉండాలనే ఆలోచనతో పాటు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనే అంశాన్ని కూడా ఆయన బాగా పరిగణనలోకి తీసుకుంటారని అంతా చెబుతుంటారు.
ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొనడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. అడ్వెంచరెస్ జర్నీ నేపథ్యంతో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. రాజమౌళి గత చిత్రాల ఎక్స్పీరియన్స్, ప్రేక్షకుల టేస్ట్ పై ఆయనకు ఉన్న పట్టే ఆ అంచనాలకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా ఫ్రాన్స్ లో జరిగిన ఓ ఈవెంట్ లో రాజమౌళి మాట్లడగా, ఆయన కెరీర్ స్టార్టింగ్ లో ప్రేక్షకుల పల్స్ పై ఎంత నమ్మకం ఉందో తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సింహాద్రి చిత్రంలో ఒక కీలక అంశంపై తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్రియేటివ్ టీమ్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. అయితే ఆడియన్స్ ఆ ఎమోషన్ ను అర్థం చేసుకుంటారని తాను గట్టిగా నమ్మినట్లు తెలిపారు. చివరికి అదే నిర్ణయం ప్రశంసలు అందుకుని, సింహాద్రి విజయానికి ఒక కారణంగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. దీంతో ప్రేక్షకుల పల్స్ అర్థం చేసుకునే రాజమౌళి స్టామినా అప్పటినుంచే కనిపించిందని అభిమానులు చర్చించుకుంటున్నారు.