పైడిపల్లి డెబ్యూ సినిమాకి అలాంటి టైటిల్? బాలీవుడ్‌కి మైండ్ బ్లాంక్!
బాలీవుడ్ ప్రముఖ హీరోతో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ ప్రముఖ హీరోతో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC63) బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి `మాన్‌స్టర్` అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి హిందీ డెబ్యూ సినిమాకే ఇలాంటి మైండ్ బ్లాంక్ అయ్యే టైటిల్ ని ఎంపిక చేయడంపై పరిశ్రమలో పెద్ద చర్చ సాగుతోంది. అయితే ఈ టైటిల్ ఎంపికపై చిత్రబృందం ఇంకా అధికారికంగా వివరాల్ని వెలువరించలేదు.
సల్మాన్ ఖాన్‌ను ఇప్పటివరకు ఎన్నడూ చూడని రీతిలో.. ఒక పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ అవతార్‌లో చూపించేందుకు డైరెక్టర్ వంశీ పైడిపల్లి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై వేదికగా శరవేగంగా జరుగుతోంది.. త్వరలోనే ఒక ఓవర్సీస్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను పంచేలా అంతర్జాతీయ స్థాయి హంగులతో వీటిని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన యాక్షన్ సీన్ లీక్ అవ్వగా.. అందులో నటించిన నటుడు కూడా ఆ విజువల్స్ చూసి నివ్వెరపోయారని బీ టౌన్ టాక్.
ఇక ఈ సినిమాకి మ్యూజిక్ సన్సేషన్ విశాల్ మిశ్రా సంగీతం అందిస్తుండటంతో పాటలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి ఆల్బమ్‌తో పాటు `మాన్‌స్టర్` టైటిల్ ట్రాక్‌ను కూడా ఆయనే ఆలపించి స్వరపరచనుండటం విశేషం. గతంలో వీరి కాంబోలో వచ్చిన హిట్స్ దృష్ట్యా.. ఈ సినిమా ఆడియో కూడా సంచలనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తదుపరి ఈద్ 2027 (మార్చి 2027) కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. `మాన్‌స్టర్` అనే టైటిల్ కన్ఫర్మ్ అయితే మాత్రం థియేటర్లలో సల్మాన్ ఖాన్ ఊచకోత ఖాయమని.. వంశీ పైడిపల్లికి బాలీవుడ్‌లో మైండ్ బ్లాంక్ అయ్యేలా గ్రాండ్ ఎంట్రీ దొరికినట్టేనని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సల్మాన్ నటించిన ఇటీవలి సినిమా `సికిందర్` ఫెయిలవ్వడంతో తీవ్రంగా నిరాశపడిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో పైడిపల్లి- దిల్ రాజు బృందంపై నమ్మకంతో అతడు భారీ కమర్షియల్ చిత్రంలో నటిస్తుండడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. హిందీ పరిశ్రమలో గట్టి పట్టు పట్టాలని ఎదురు చూస్తున్న దిల్ రాజు ఈ సినిమాతో తన డ్రీమ్ ని నెరవేర్చుకుంటారన్న చర్చా సాగుతోంది.