జతకలిస్తే హిట్టే.. ఈసారీ 'వెన్నెల'కి కలిసొస్తుందా?

మరోవైపు కీర్తికి ప్యారడైజ్ సక్సెస్ కావడం కీలకమే. గత కొంతకాలంగా ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి.

Update: 2026-09-05 05:02 GMT

టాలీవుడ్‌ లో కొన్ని కాంబినేషన్లకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే చాలు.. ఆ కాంబోపై అంచనాలు పెరిగిపోతాయి. అలాంటి జోడీల్లో నాని, కీర్తి సురేష్ జంట కూడా ఒకటి. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించిన రెండు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మూడోసారి ఆ జోడీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈసారి కీర్తి కంప్లీట్ హీరోయిన్‌ గా కనిపించడం లేదు. మరి నాని-కీర్తి కాంబో సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందా? అనేదే ఆసక్తికరంగా మారింది.

నాని, కీర్తి సురేష్ తొలిసారి నేను లోకల్ సినిమాలో జంటగా కనిపించారు. 2017లో వచ్చిన ఆ మూవీ యూత్‌ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నాని, కీర్తి మధ్య కెమిస్ట్రీ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ కాంబినేషన్‌ కు మరింత క్రేజ్ తీసుకొచ్చిన సినిమా దసరా. 2023లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో నాని ధరణిగా, కీర్తి వెన్నెలగా నటించారు.

రా అండ్ రస్టిక్ కథకు వీరిద్దరి పెర్ఫార్మెన్స్ బలంగా నిలిచింది. ముఖ్యంగా వెన్నెల రోల్ కీర్తి కెరీర్‌ లో గుర్తుండిపోయే పాత్రగా మారింది. చమ్కీల అంగీలేసి పాటతో పాటు నాని-కీర్తి జోడీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే కాంబో మరోసారి సందడి చేస్తోంది. నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న ది ప్యారడైజ్ లో కీర్తి సురేష్ పూర్తి స్థాయి హీరోయిన్‌ గా నటించడం లేదు.

అయితే ఏష నాగుల కట్టమీద అనే ఫోక్ మాస్ సాంగ్‌ లో ఆమె ప్రత్యేకంగా కనిపించారు. ఆ పాటను ప్రస్తుతం దసరాలోని చమ్కీల అంగీలేసితో కలిపి ప్రమోట్ చేస్తుండటం ఆసక్తిని పెంచుతోంది. తాజాగా నాని, కీర్తి కలిసి కనిపించిన ప్రమోషనల్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వెన్నెల మోమోరీస్ ను మరోసారి గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్.. ఈసారీ నాని-కీర్తి కాంబినేషన్ కలిసొస్తుందంటూ చర్చించుకుంటున్నారు.

మరోవైపు కీర్తికి ప్యారడైజ్ సక్సెస్ కావడం కీలకమే. గత కొంతకాలంగా ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి. ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో పాటు కొన్ని పెద్ద ప్రాజెక్టులూ నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు నాని లాంటి క్రేజ్ ఉన్న హీరోతో కలిసి కనిపించడం, అందులోనూ దసరాలో తనకు మంచి గుర్తింపు తెచ్చిన శ్రీకాంత్ ఓదెల సినిమాతో అనుబంధం ఏర్పడటం ఆసక్తికరంగా మారింది.

ఇక ప్యారడైజ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నాని ఊరమాస్ లుక్, శ్రీకాంత్ టేకింగ్, అనిరుధ్ మ్యూజిక్ హైప్‌ పెంచుతున్నాయి. ముఖ్యంగా ఏష నాగుల కట్టమీద పాటకు వస్తున్న రెస్పాన్స్ ఎక్స్ ట్రా బజ్ తీసుకొస్తోంది. ఏదేమైనా నేను లోకల్ లో జంటగా హిట్.. దసరాలో జంటగా బ్లాక్‌ బస్టర్.. ఇప్పుడు ప్యారడైజ్ లో స్పెషల్ సాంగ్‌ తో జతకట్టిన నాని-కీర్తి. ఈసారి కూడా ఆ కాంబో సక్సెస్ సెంటిమెంట్‌ ను కొనసాగిస్తుందా? కీర్తికి వెన్నెల తర్వాత మరోసారి కలిసొస్తుందా? తెలియాలంటే ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.




Tags:    

Similar News