మన ప్యానెల్ (X) ప్రొగ్రెస్సివ్ ప్యానెల్: ఎన్నికల ఎజెండా మ్యానిఫెస్టో హైలైట్స్
ఇండస్ట్రీలోని ప్రతీ నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్రణాళికలో ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేశారు. ఇరు ప్యానెళ్ల మ్యానిఫెస్టోలో ఏం ఉందో ఇక్కడ అందిస్తున్నాం.
సెప్టెంబర్ 6న జరగనున్న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ విడుదల చేసిన మేనిఫెస్టో సభ్యుల్లో కొత్త ఆశలను నింపుతుండగా, సీనియర్ నిర్మాత సి. కల్యాణ్ నేతృత్వంలోని 'మనా ప్యానెల్' తమ సమగ్ర మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇండస్ట్రీలోని ప్రతీ నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్రణాళికలో ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేశారు. ఇరు ప్యానెళ్ల మ్యానిఫెస్టోలో ఏం ఉందో ఇక్కడ అందిస్తున్నాం.
ప్రోగ్రెసివ్ ప్యానెల్ సంక్షేమ మేనిఫెస్టో:
సెప్టెంబర్ 6న జరగనున్న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ విడుదల చేసిన మేనిఫెస్టో సభ్యుల్లో కొత్త ఆశలను నింపుతోంది. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య భద్రతలకు పెద్దపీట వేస్తూ అర్హత ఉన్న ప్రతి సభ్యుడికి ఎలాంటి సిఫార్సులు లేకుండా రూ.5 లక్షల క్యాష్‌లెస్ వైద్య సదుపాయాన్ని అందిస్తామని ప్యానెల్ హామీనిచ్చింది. దీనికి తోడు ఆపదలో ఉన్న నిర్మాతలను తక్షణమే ఆదుకోవడానికి రూ.50 లక్షలతో ప్రత్యేక ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేయడం.. దాదాపు 300 మంది యాన్యువల్ మెంబర్లకు కనీస వన్-టైమ్ ఫీజుతో రెగ్యులర్ సభ్యత్వ హోదా కల్పించడం వంటి కీలక నిర్ణయాలను ప్రకటించింది.
పరిశ్రమలోకి అడుగుపెట్టే కొత్త నిర్మాతలకు అడుగడుగునా వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రోగ్రెసివ్ ప్యానెల్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. కొత్త నిర్మాతలకు అవసరమైన మార్గదర్శకత్వం, కథల ఎంపిక, నిర్మాణ విధానాలలో సరైన సూచనలు ఇచ్చేందుకు `సింగిల్ విండో ప్రొడ్యూసర్ హెల్ప్‌లైన్` ప్రత్యేక స్క్రిప్ట్ గైడెన్స్ వ్యవస్థలను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. అలాగే వర్కర్ల యూనియన్లతో ఎదురయ్యే సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రొడక్షన్ హౌస్‌లలో మహిళా భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రామిస్ చేసింది.
కౌన్సిల్ నిర్ణయాలు ఏకపక్షంగా కాకుండా పారదర్శకంగా.. ప్రతి సభ్యుడికి సమన్యాయం జరిగేలా చట్టబద్ధమైన విధానాన్ని తెస్తామని ప్రోగ్రెసివ్ ప్యానెల్ వెల్లడించింది. కాగా చిన్న నిర్మాతల సంక్షేమమే ధ్యేయంగా ముందుకొచ్చిన ఈ ప్యానెల్ ఆశయాలకు, ప్రణాళికలకు తమ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మద్దతు తెలిపారు. సంక్షేమం, పారదర్శకతే అజెండాగా సెప్టెంబర్ 6న జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిర్మాతల ఆదరణను ఆశిస్తోంది.
'మన ప్యానెల్' సంక్షేమ మేనిఫెస్టో:
ఈ ఉత్సాహభరితమైన ఎన్నికల వేళ సీనియర్ నిర్మాత సి. కల్యాణ్ నేతృత్వంలోని `మన ప్యానెల్` తమ సమగ్ర మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇండస్ట్రీలోని ప్రతీ నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్రణాళికలో ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేశారు. కౌన్సిల్‌లోని సభ్యులు.. వారి కుటుంబ సభ్యులందరికీ మెరుగైన వైద్య సహాయం అందించేలా హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని విస్తరించడంతో పాటు కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ నిధులను ఎమర్జెన్సీ సాయం కోసం పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని మేకర్స్ హామీ ఇచ్చారు.
ప్రధానంగా చిన్న బడ్జెట్ సినిమాలకు ఎదురవుతున్న సమస్యలపై మనా ప్యానెల్ ప్రత్యేక దృష్టి సారించింది. చిన్న సినిమాల ప్రమోషన్ ఖర్చులను తగ్గించేందుకు కౌన్సిల్ ద్వారా ఉచిత డిజిటల్ ప్రచార మద్దతు అందిస్తామని.. థియేటర్లలో విపిఎఫ్ లేదా క్యూబ్-యుఎఫ్ఓ వంటి డిజిటల్ ఛార్జీల భారాన్ని తగ్గించి ఊరట కలిగిస్తామని పేర్కొంది. దీనితో పాటు థియేటర్ల కేటాయింపులో చిన్న చిత్రాలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. పంపిణీదారుల నుంచి రావాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించేలా చూస్తామని స్పష్టం చేసింది.
పరిశ్రమ అభివృద్ధి కోసం షూటింగ్‌ల నిర్వహణకు ప్రభుత్వం, స్థానిక సంస్థల నుండి వేగవంతంగా `సింగిల్ విండో` అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో వెల్లడించారు. అలాగే 24 ఫ్రేమ్స్ కార్మిక సంఘాలు, ఫిల్మ్ ఫెడరేషన్‌తో ఉద్భవించే రోజువారీ వేతనాలు, సమ్మేళనాల సమస్యలను నిర్మాతల ప్రయోజనాలకు భంగం కలగకుండా స్నేహపూర్వక వాతావరణంలో చర్చించి పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. ఈ సమగ్ర సంక్షేమ హామీలతో మన ప్యానెల్ ఎన్నికల బరిలో నిర్మాతల మద్దతును గెలుచుకునేందుకు సిద్ధమైంది. 6 సెప్టెంబర్ ఎన్నికల లితాలు కచ్ఛితంగా నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగానే వస్తాయని అంతా భావిస్తున్నారు.