టాలీవుడ్ కి కాజ‌ల్ రిటైర్మెంట్ ఇచ్చేసిన‌ట్లే?

టాలీవుడ్‌లో దశాబ్దానికి పైగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలుగొంది.. చందమామ గా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కాజల్ అగర్వాల్ కెరీర్ ఎలా సాగుతుంద‌న్న‌ది తెలిసిందే.

Update: 2026-10-20 19:30 GMT

టాలీవుడ్‌లో దశాబ్దానికి పైగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలుగొంది.. చందమామ గా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కాజల్ అగర్వాల్ కెరీర్ ఎలా సాగుతుంద‌న్న‌ది తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుస బ్లాక్‌బస్టర్లతో ఇండస్ట్రీని ఏలిన భామకు ఇక్కడ అవకాశాలు పూర్తిగా మందగించాయి. దీంతో టాలీవుడ్‌కు కాజల్ దాదాపు రిటైర్మెంట్ ప్రకటించినట్లేనని.. ఇకపై నేరుగా తెలుగు సినిమాలు చేసే అవకాశాలు లేనట్లేనని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాజల్ చివరిసారిగా టాలీవుడ్‌లో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప` చిత్రంలో పార్వతీ దేవి పాత్రలో ప్రత్యేక కామియోలో నటించింది. ఆ ప్రాజెక్ట్‌ కంటే ముందే అమ్మ‌డికి తెలుగులో ప్రధాన కథానాయికగా అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. పెళ్లి .. మాతృత్వం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినా? యంగ్ హీరోల సినిమాల్లో నవతరం భామల జోరు పెరగడం.. సీనియర్ హీరోల సరసన కూడా కొత్త కాంబినేషన్ల వైపే మేకర్స్ మొగ్గు చూపడంతో కాజల్‌కు టాలీవుడ్ అవ‌కాశాలు దూర‌మ‌య్యాయి.

అయితే తెలుగు ఛాన్సులు లేకపోయినా? కాజల్ కెరీర్ మాత్రం ఆగిపోలేదు. హిందీ ఇండస్ట్రీలో అడపా దడపా సినిమాలు చేస్తూ ఉనికిని చాటుకుంటోంది. బాలీవుడ్‌లో ప్రయోగాత్మక పాత్రలు .. ప్రత్యేక పాత్రలపై దృష్టి పెట్టిన ఈ భామ అక్కడ లభించే ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకుంటూ నటన కొనసాగిస్తోంది.

ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న నితేష్ తివారీ మైథలాజికల్ వండర్ `రామాయణ` లో కాజల్ అగర్వాల్ న‌టిస్తోంది. రాకింగ్ స్టార్ యశ్ పోషిస్తున్న రావణాసురుడి పాత్రకు జోడీగా మండోదరి దేవి పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర దక్కడం ఆమె కెరీర్‌కు మళ్లీ బిగ్ బూస్ట్ ఇస్తుందన్న‌ది కాద‌న‌లేని నిజం.

నటీమణులకు పెళ్లి తర్వాత టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడం సహజమే అయినా? కాజల్ లాంటి స్టార్ డమ్ ఉన్న నటి టాలీవుడ్ సినిమాలకు పూర్తిగా దూరం కావడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. క్యారెక్టర్ రోల్స్ ..కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే తప్ప సాధారణ కమర్షియల్ సినిమాల్లో అమ్మ‌డు కనిపించే అవకాశం లేనట్టేనని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మొత్తానికి తెలుగు తెరపై స్వర్ణయుగాన్ని ఏలిన చందమామ చాప్టర్ టాలీవుడ్‌లో ఇంచుమించు ముగిసినట్లే కనిపిస్తోంది. కానీ హిందీలో `రామాయణ` వంటి పాన్-ఇండియా పాపులర్ చిత్రాల ద్వారా నేషనల్ వైడ్‌గా అలరిం చేందుకు సిద్ధమవుతోంది. తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేని ఎన్నో మరుపురాని పాత్రలను అందించిన కాజల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బాలీవుడ్ వేదికగా ఎలాంటి విజయాలనుందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News