సోషల్ మీడియా నెగెటివిటీని జయించడం ఎలా?

సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు అభిమానుల ప్రేమ ఎంత వేగంగా దక్కుతుందో? అంతే వేగంగా ట్రోలింగ్ రూపంలో వ్యతిరేకత కూడా ఎదురవుతుంది.

Update: 2026-10-20 17:30 GMT

సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు అభిమానుల ప్రేమ ఎంత వేగంగా దక్కుతుందో? అంతే వేగంగా ట్రోలింగ్ రూపంలో వ్యతిరేకత కూడా ఎదురవుతుంది. చిన్న‌పాటి పొరపాట్లు.. నిరాధా రమైన వదంతుల కారణంగా కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే ట్రోలింగ్ తారల మానసిక ప్రశాంతతను దెబ్బతీ స్తుంది. ఈ నెగెటివిటీని సమర్థవంతంగా ఎదుర్కొని.. మానసిక స్థైర్యంతో బయటపడటం నేటి సెలబ్రిటీలకు అత్యంత అవసరమైన నైపుణ్యంగా మారింది.

ట్రోలింగ్ నుంచి బయటపడటానికి తొలి మెట్టు సోషల్ మీడియాకు కొంతకాలం దూర‌గా ఉండటం లేదా దాన్ని నియంత్రించడం. ప్రతి చిన్న కామెంట్ ..నెగెటివ్ పోస్ట్‌ను నిరంతరం గమనించడం వల్ల మానసిక ఆందోళన మరింత పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో డిజిటల్ డిటాక్స్ పాటించడం ద్వారా అనవసరమైన మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే సోషల్ మీడియాలో వచ్చే విమర్శలన్నింటినీ వ్యక్తిగతంగా తీసుకోకపోవడం చాలా ముఖ్యం. నిర్మాణా త్మకమైన విమర్శలను స్వీకరించడం ఎంత అవసరమో? కేవలం కక్షసాధింపు చర్యల కోసం .. ఆన్‌లైన్ వేదికగా వేధించాలనే ఉద్దేశంతో చేసే అసంబద్ధమైన ట్రోలింగ్‌ను పూర్తిగా విస్మరించడం నేర్చుకోవాలంటున్నారు. ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతీ అభిప్రాయం నిజం కాదనే స్పష్టతను కలిగి ఉండటం మానసిక ప్రశాంతతను ఇస్తుందని సూచిస్తున్నారు.

ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు.. అత్యంత సన్నిహితులు .. నిజమైన స్నేహితుల మద్దతు తీసుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మనల్ని బాగా అర్థం చేసుకునేవారితో భావాలను పంచుకోవడం వల్ల ఒంటరితనం భావన తొలగిపోతుంది. వారిచ్చే ధైర్యం ప్రతికూల వాతావరణాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా మానసిక శక్తిని అందిస్తుంది.

కేవలం ఆన్‌లైన్ ప్రపంచానికే పరిమితం కాకుండా దృష్టిని నిజ జీవితంలోని సానుకూల అంశాలపై కేంద్రీ కరించాలి. కొత్త ప్రాజెక్టులు, హాబీలు, వ్యాయామం, సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగమవడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. వాస్తవ ప్రపంచంలో లభించే ఆదరణ.. ప్రేమ నెగెటివిటీని మర్చిపోయేలా చేస్తాయి.

అంతిమంగా ట్రోలింగ్‌ను ఒక తాత్కాలిక సమస్యగా భావించి బలమైన ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి. ఎవరెన్ని విమర్శలు చేసినా? తమ పనిపై, లక్ష్యంపై దృష్టి పెట్టడమే ఉత్తమమైన సమాధానం. నిలకడైన కృషి, సానుకూల దృక్పథంతో సెలబ్రిటీలు ఇలాంటి ఆన్‌లైన్ వేధింపుల నుంచి సులభంగా బయటపడి మరింత బలంతో రాణించవచ్చు.

Tags:    

Similar News