వింటేజ్ లుక్‌తో మతి చెడగొట్టిన రకుల్
నటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ సినీ వర్గాల్లో, అభిమానులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ సినీ వర్గాల్లో, అభిమానులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని.. ఆ అనుభూతి ఎంతో మధురంగా ఉందని రకుల్ పేర్కొన్నారు. `టీమ్ రామాయణ`తో కలిసి ప్రచార వేదికపై పాల్గొన్న ఆ ప్రత్యేక సాయంత్రం తనకెంతో ఉత్సాహాన్నిచ్చిందని.. తెలుగు ప్రేక్షకులు సినిమాపై చూపించే ప్రేమను ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు. ఈ పోస్ట్‌లో తన తదుపరి భారీ పౌరాణిక చిత్రం `రామాయణ` గురించిన విశేషాలను షేర్ చేస్తూ అభిమానులతో భావోద్వేగాలను షేర్ చేసుకున్నారు.
ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ అత్యంత ప్రాధాన్యత కలిగిన `శూర్పణఖ` పాత్రలో కనిపించనున్నారు. రామాయణ కథాంశంలో ఎంతో కీలకమైన ఈ పౌరాణిక పాత్రలో గొప్ప అభినయాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. ఈ పాత్రకు సంబంధించిన లుక్, వీడియో సోషల్ మీడియాలో విడుదల కాగా.. అందులో రకుల్ అద్భుతమైన అప్పియరెన్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీ హంగులతో ఈ చిత్రం తెరకెక్కుతోందని రకుల్ తెలిపారు.
సోషల్ మీడియాలో రకుల్ పోస్ట్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా తనను `వింటేజ్ లుక్`లో చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. చెవులకు జుంకాలు.. డిజైనర్ ఫ్రాక్ లో రకుల్ మెరిసిపోయింది. రకుల్ అందాన్ని, అంకితభావాన్ని కొనియాడుతూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. శూర్పణఖ లాంటి శక్తివంతమైన పాత్రలో రకుల్ ఏ విధంగా అదరగొట్టబోతున్నారో చూడాలని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజా పోస్ట్‌లోని సాంగ్ సెలక్షన్, తన ఎగ్జోటిక్ లుక్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
2026 సంవత్సరంలో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఎంతో బిజీగా కొనసాగుతోంది. ఈ ఏడాది రకుల్ నటించిన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గత మేలో కామెడీ-డ్రామా చిత్రం `పతి పత్నీ ఔర్ వో దో` లో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. వైవిధ్యమైన కథా పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్లో తనదైన ముద్ర వేస్తున్న రకుల్.. ఈ ఏడాది వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇక 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం `రామాయణ: పార్ట్ 1` రకుల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ఇతిహాస చిత్రంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి వంటి దిగ్గజ నటులతో పాటు రకుల్ కూడా భాగం కావడం విశేషం.