బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. ఈసారి హౌస్‌లోకి వెళ్లేది వీళ్లేనా?
ముఖ్యంగా ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది.
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే షోకు సంబంధించిన ప్రచారం మొదలైంది. ముఖ్యంగా ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది.
సీజన్ 10లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కనిపిస్తున్న విషయం తెలిసిందే. అగ్ని పరీక్ష కార్యక్రమం ద్వారా ఎంపికైన కొంతమంది సామాన్యులు కూడా బిగ్‌బాస్ ప్రధాన షోలోకి వచ్చే అవకాశం పొందారు. దీంతో ఈసారి కంటెస్టెంట్ల జాబితా మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
సెలబ్రిటీలు వీళ్లే..!
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ నటి, టీవీ హోస్ట్ వర్షిణి సౌందరరాజన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అలాగే జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లు రామ్ ప్రసాద్, నరేష్ కూడా ఈ షోలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.
సినిమాల్లో నటించిన కృష్ణుడు, టెంపర్ సినిమాలో కనిపించిన వంశీ, కథ సినిమాతో గుర్తింపు పొందిన ఆదిత్ ఈశ్వరన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరితో పాటు టీవీ నటులు ముఖేష్ గౌడ, డెబ్ జానీ, చైత్ర రాయ్ కూడా బిగ్‌బాస్ సీజన్ 10లో పాల్గొననున్నారని సమాచారం.
యాంకర్ సుధీర్ రెడ్డి పేరు కూడా కంటెస్టెంట్ల జాబితాలో ఉందని తెలుస్తోంది. అయితే అధికారికంగా నిర్వాహకులు ప్రకటించే వరకు ఈ పేర్లను ఖరారైన జాబితాగా చెప్పలేం.
సామాన్యులు వీళ్లే..!
ఇక అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి కొంతమందికి బిగ్‌బాస్ ప్రధాన షోలోకి వెళ్లే అవకాశం దక్కినట్లు సమాచారం. రోహిత్ నాయుడు, షాలిని, సృష్టి వ్యాకరణం, చరణ్, సింగర్ ఝాన్సీ, రామకృష్ణ పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాబట్టి ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో సినిమా, టీవీ, కామెడీ, యాంకరింగ్‌తో పాటు సామాన్యుల నుంచి వచ్చినవాళ్లు కూడా హంగామా చెయ్యనున్నారు. మరి వీరిలో నిజంగా ఎవరు హౌస్‌లోకి అడుగుపెడతారో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.