జోరు పెంచిన ఖుషీ కపూర్.. జెన్ జీ కి బెస్ట్ చాయిస్!
మరో లుక్ లో ఓవర్ సైజ్డ్ డెనిమ్ జాకెట్ ధరింది.. దీనికి కింద బ్లూ షర్ట్ పై వైట్ కలర్ చెక్స్ కలిగిన షర్టు ధరించింది.
దివంగత నటీమణి, అందాలతార శ్రీదేవి చిన్న కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఖుషీ కపూర్. ఈమె తన సోదరీ జాన్వీ కపూర్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకోలేదు. కానీ ఈ మధ్యకాలంలో జెన్ జీ యువతను టార్గెట్ చేసుకొని చేస్తున్న పనులు , ఇస్తున్న ఫోజులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఈమెకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం శ్రీదేవి గతంలో నటించిన మామ్ చిత్ర సీక్వెల్ మామ్ 2 లో తన దివంగత తల్లి శ్రీదేవి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే .ముఖ్యంగా కరిష్మా తన్నాతో కలిసి ఖుషీ కపూర్ ఈ సినిమాలో నటిస్తోంది. ఒకవైపు ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే..మరొకవైపు అద్భుతమైన ఫ్యాషన్ స్టోరీ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. గ్రాజియా ఇండియా కవర్ పేజీపై భిన్నమైన ఆకృతులతో ఫోజులిచ్చి అభిమానులను మెస్మరైజ్ చేసింది . పైగా తన ట్రెండీ ఔట్ఫిట్ తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది.
ఫోటోషూట్ లో భాగంగా నాలుగు విభిన్నమైన లుక్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈమె అందులో ఒకటి ఆలివ్ కలర్ సీక్విన్డ్ కార్డిగాన్ టాప్ ధరించి, దీనికి కాంబినేషన్లో వాల్యూమినస్ డెనిమ్ లాంగ్ స్కర్ట్ ధరించి అవుట్ ఫిట్ తో ఆకట్టుకుంది.
మరో లుక్ లో ఓవర్ సైజ్డ్ డెనిమ్ జాకెట్ ధరింది.. దీనికి కింద బ్లూ షర్ట్ పై వైట్ కలర్ చెక్స్ కలిగిన షర్టు ధరించింది. పైన బటన్స్ ఓపెన్ చేసి రెండు చేతులతో షర్టు పట్టుకున్న ఈమె.. దీనికి కాంబినేషన్లో డెనిమ్ ప్యాంట్ ధరించింది. తన మేకోవర్ ను ఫుల్ ఫీల్ చేసుకోవడానికి కలర్ఫుల్ డిజైన్ కలిగిన నెక్లెస్ ధరించింది.
మరో లుక్ లో నల్లటి లేస్ అంచు కలిగిన యాష్ కలర్ స్లిప్ డ్రెస్ ధరించి.. దీనికి వజ్రాల ఆభరణాలను జత చేసింది.. ముఖ్యంగా ఈ లుక్ ఓల్డ్ హాలీవుడ్ గ్లామర్ను వెదజల్లుతూ ఆశ్చర్యపరిచింది..
మరో లుక్ విషయానికి వస్తే.. షీర్ వైట్ డియోర్ నిట్ టాప్ ను వింటేజ్ డెనిమ్, గోల్డ్ ఇయర్ రింగ్స్ తో తన లుక్కును ఫుల్ ఫిల్ చేసుకుంది.
మొత్తానికి అయితే ఖుషి కపూర్ గ్రాజియా ఇండియా కవర్ పేజ్ కోసం ఇచ్చిన ఈ ఫోటో ఫోజులు, వేసుకున్న డ్రెస్సులు జెన్ జీ యువతను మరింత ఆకట్టుకుంటున్నాయి.
ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ నవతరం మెచ్చేలా ఉన్నాయని చెప్పవచ్చు.