తెలంగాణ యాసతో కట్టుపడేస్తున్న రష్మిక.. హైదరాబాద్ కోడలు మేజిక్!

నాకు చాలా జెలస్‌గా ఉంది కానీ ఇంటికి వెళ్లిన తర్వాత చూస్తా. విజయ్ గారితోటి షూటింగ్ చేసి వచ్చినా.. ఏందయ్యా సామీ!

Update: 2026-09-05 03:54 GMT

తెలుగు ప్రాంతాలైన ఆంధ్రా, తెలంగాణల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో విభిన్నమైన యాస, భాషా సౌందర్యం ఉంది. ఇక్కడి సంస్కృతి, జీవన విధానం మారినట్లే మాట్లాడే తీరులోని వైవిధ్యం కూడా ఎంతో గమ్మత్తుగా, ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండల తెలంగాణ యాస చాలా ప్రత్యేకంగా, వినసొంపుగా ఉంటుంది. ఇప్పుడు ఇదే తెలంగాణ యాసను టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఎంతో ముచ్చటగా ఒంటబట్టించుకుని అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

రష్మిక మందన్న స్వస్థలం కర్ణాటకలోని కూర్గ్ (కొడగు) జిల్లాలోని విరాజ్‌పేట. అక్కడి కొడవ కమ్యూనిటీకి చెందిన రష్మిక బెంగళూరులో చదువుకుని, కన్నడ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో, క్యూట్‌నెస్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని 'హైదరాబాద్ కోడలు'గా మారిన తర్వాత, రష్మిక మాట తీరులో తెలంగాణ యాసలోని లాలిత్యం భాసించడం విశేషం.

ఇటీవల ఆనంద్ దేవరకొండ నటించిన ఎపిక్ (EPIC) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రష్మిక ముచ్చటైన తెలంగాణ యాస అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేదికపై యాంకర్ `లవ్ విషయంలో విజయ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెబుతారు?` అని ప్రశ్నించినప్పుడు రష్మిక ఇచ్చిన సమాధానం.. దానికి జ‌వాబుగా మాట్లాడిన యాస సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఆ ప్రశ్నకు రష్మిక ఎంతో క్యూట్‌గా స్పందిస్తూ.. `విజయ్ గారి గురించి ఏం చెప్పాలి.. ఇప్పుడు జిమ్‌లో ఉన్నారు. నాకు చాలా జెలస్‌గా ఉంది కానీ ఇంటికి వెళ్లిన తర్వాత చూస్తా. విజయ్ గారితోటి షూటింగ్ చేసి వచ్చినా.. ఏందయ్యా సామీ! సో, షూటింగ్ జరుగుతుంది` అంటూ పక్కా తెలంగాణ యాసలో జవాబిచ్చి అక్కడున్న వారందరినీ అలరించారు. విజయ్ దేవరకొండ శైలిలో ఆమె పలికిన ఏందయ్యా సామీ అనే పదం ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ గారితోటి షూటింగ్ చేసి వచ్చినా.. అంటూ తెలంగాణ యాస‌తో ఆక‌ట్టుకున్నారు. మొత్తానికి హైద‌రాబాదీ కోడ‌లికి యాస- భాష బాగా వంట ప‌ట్టాయ‌ని నెటిజ‌నులు ప్ర‌శంసిస్తున్నారు.

అదే సమయంలో ఆనంద్ దేవరకొండ చిత్రం ఎపిక్ విడుదల తేదీని గుర్తు చేస్తూ.. `మర్చిపోకూడదు కదా.. సెప్టెంబర్ 10త్ ఇస్ యాక్చువల్లీ ద ప్రీమియర్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఐ హోప్ యు గైస్ లైక్ ఇట్.. ఐ హోప్ యు ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ ద బెస్ట్ గైస్` అంటూ చిత్రయూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. కన్నడ ప్రాంతానికి చెందిన నటి అయినా తెలుగు భాషను, ముఖ్యంగా తెలంగాణ యాసను ఇంత సహజంగా పలకడంపై నెటిజన్లు, అభిమానులు రష్మికపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News