• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2…. 7 ఏళ్ళ రికార్డ్...

పుష్ప 2…. 7 ఏళ్ళ రికార్డ్ బ్రేక్

| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తగ్గేది లే అంటూ థియేటర్స్ లో ఈ సినిమా వసూళ్ళ పర్వం సాగుతోంది.

By - Tupaki Desk
Update: 2024-12-17 06:47 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తగ్గేది లే అంటూ థియేటర్స్ లో ఈ సినిమా వసూళ్ళ పర్వం సాగుతోంది. రెండో వారంలో కూడా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతూ ఉండటం విశేషం. సుకుమార్ రైటింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. కేవలం 11 రోజుల్లోనే 1300 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడం ద్వారా ‘పుష్ప 2’ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.

హిందీలో కూడా 561+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని జెట్ స్పీడ్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న డబ్బింగ్ మూవీగా ‘బాహుబలి 2’ ఉండేది. ఏడేళ్లుగా ఈ సినిమా రికార్డ్ పదిలంగా ఉంది. అయితే ‘పుష్ప 2’ కేవలం 11 రోజుల్లోనే ఈ రికార్డ్ ని బ్రేక్ చేసేసింది. ఇప్పుడు హిందీలో కూడా అత్యధిక కలెక్షన్స్ అందుకోబోయే చిత్రంగా నెంబర్ వన్ స్థానంలోకి ఈ మూవీ వెళ్లబోతోంది.

దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో కూడా టాప్ 3లోకి ‘పుష్ప 2’ వచ్చింది. ఈ కలెక్షన్స్ అందుకోవడానికి ‘బాహుబలి 2’కి 16 రోజుల సమయం పట్టింది. అయితే ‘పుష్ప 2’ మాత్రం కేవలం 11 రోజుల్లోనే సాధించింది. అంటే యావరేజ్ గా ఈ మూవీ రోజుకి 118 కోట్ల మేరకు కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. నార్త్ అమెరికాలో కూడా ఈ మూవీ కలెక్షన్స్ 14 మిలియన్ డాలర్స్ కి దగ్గరగా ఉంది. సోమవారం నార్త్ అమెరికాలో ఈ చ్చిత్రం 175K డాలర్స్ కలెక్ట్ చేసింది.

దీంతో టోటల్ నార్త్ అమెరికాలో $13,028,000 కలెక్షన్స్ అందుకుంది. ఇక 12వ రోజైన సోమవారం దేశ వ్యాప్తంగా ఈ సినిమాకి 19474 షోలు పడ్డాయి. తద్వారా 26.49 కోట్ల కలెక్షన్స్ ని ఈ మూవీ సాధిస్తే అందులో 20.39 కోట్లు కేవలం హిందీ నుంచి వచ్చాయి. రెండో శుక్రవారంతో పోల్చుకుంటే రెండో సోమవారం కేవలం 29% శాతం మాత్రమే కలెక్షన్స్ తగ్గాయి.

దీనిని బట్టి ఈ సినిమా సెకండ్ వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తుందనే మాట వినిపిస్తోంది. సెకండ్ ఫ్రైడే ఈ సినిమా దేశ వ్యాప్తంగా 19,845 షోలలో ప్రదర్శించబడింది. వీటి ద్వారా 37.34 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. హిందీలోనే 28.48 కోట్లు వసూళ్లు చేసింది. దీనిని బట్టి నార్త్ ఇండియా బెల్ట్ లో పుష్ప 2 సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ వస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Pushpa2collections 
  • Pushpa2therule 
  • Pushpa2hindi 
  • Tollywood 
  • Pushpa2boxoffice 
  • Filmindustry 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS