ఆత్మ‌ నివ‌శించే ఇల్లు కొనుక్కుని స్టార్ క‌పుల్ పాట్లు

అంత‌గా ఇబ్బంది పెట్టిన‌ ఆ ఇల్లు ఏది? ఇంత‌కీ ఎవ‌రు ఆ సెల‌బ్రిటీ క‌పుల్? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

Update: 2024-05-19 00:30 GMT

నిజానికి ఆ ఇంట్లో ఏ ఆత్మా లేదు.. కానీ దెయ్యం వేధించినంతగా భ‌య‌ప‌డ్డారు ఆ జంట‌. ఇల్లు కూలుతుందేమోన‌ని క‌ల‌త చెందారు. అంత‌గా ఇబ్బంది పెట్టిన‌ ఆ ఇల్లు ఏది? ఇంత‌కీ ఎవ‌రు ఆ సెల‌బ్రిటీ క‌పుల్? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.


గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా అమెరిక‌న్ గాయ‌కుడు కం న‌టుడు నిక్ ని ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పీసీ- నిక్ జోనాస్ జంట పెళ్లి త‌ర్వాత కొనుగోలు చేసిన ఆ కొత్త ఇంటితో చిక్కొచ్చి ప‌డింది. ఆ ఇంట్లో త‌మ కుమార్తె మాల్తీ మేరీతో క‌లిసి ఈ జంట‌ కొన్నాళ్లు జీవించారు. కానీ ఆ ఇల్లు సుర‌క్షితం కాద‌ని నిర్ధారించుకున్నారు. దానికి కార‌ణం ఇంటి సీలింగ్ నుంచి నీటి లీకేజీ బ‌య‌ట‌ప‌డింది. దానివ‌ల్ల ఇంట్లో పై భాగం చాలా వ‌ర‌కూ అచ్చులు ఊడి కింద ప‌డ‌టం ప్రారంభ‌మైంది. దీంతో ఇల్లు ఎక్క‌డ కూలుతుందోన‌ని ప్రియానిక్ జంట తీవ్రంగా క‌ల‌త‌కు గుర‌య్యారు. అంతేకాదు త‌మతో ఈ నిజాన్ని క‌ప్పి పుచ్చి ఇంటిని అమ్మేసిన య‌జ‌మానిపై కోర్టులో దావా కూడా వేసారు. ఇంటిని పూర్తిగా రిపేర్లు చేయించి ఇప్ప‌టికి అంటే ఖాళీ చేసిన ఆర్నెళ్ల‌కు తిరిగి మ‌ళ్లీ ఆ ఇంటికి వ‌చ్చారు.

ఇంత‌కీ ఈ ఇంటి ఖ‌రీదు ఎంతో తెలుసా? తెలుసుకుంటే క‌ళ్లు భైర్లు క‌మ్మ‌డం ఖాయం. ఈ మాన్ష‌న్ ఖ‌రీదు 1600 కోట్లు (20 మిలియ‌న్ డాల‌ర్లు). లాస్ ఏంజెల్స్ లో ఉంది. ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు వీడియోలను ప్రియాంక చోప్రా ఇంత‌కుముందు సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. త‌మ సొంత ఇంటికి తిరిగి చేరుకున్న అనంత‌రం ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ లో బాల్కనీ నుండి లాస్ ఏంజిల్స్ అద్భుతమైన నైట్ వీక్షణ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఒకదానికి ``ఇంట్లో ఉండటం... నా ఆత్మకు ఆహారం ఇస్తోంది`` అని క్యాప్షన్ ఇచ్చింది. ఆమె ఇంట్లో తీసిన అస్పష్టమైన సెల్ఫీని కూడా పోస్ట్ చేసింది. `ఓ హే…` అని ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

Read more!

పీసీ-నిక్ జంట 2018లో వివాహం చేసుకున్నారు. ఈ జంట‌ తమ హాలీవుడ్ హిల్స్ మాన్షన్‌లో తమ కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి నివసించారు. జనవరి 2024 నాటికి ఈ ఇంటికి వ‌చ్చి రెండు సంవత్సరాలు నిండింది. ఈ భవనంలో ఏడు బెడ్‌రూమ్‌లు, తొమ్మిది బాత్‌రూమ్‌లు, ఒక చెఫ్ కిచెన్, ఉష్ణోగ్రత-నియంత్రిత వైన్ రూమ్ ఉన్నాయి. ఇండోర్ బాస్కెట్‌బాల్ కోర్ట్, ఇంటీరియర్ బౌలింగ్ అల్లే, హోమ్ థియేటర్, ఎంటర్‌టైన్‌మెంట్ లాంజ్, స్టీమ్ షవర్‌తో కూడిన స్పా, ఫుల్-సర్వీస్ జిమ్ .. బిలియర్డ్స్ గది వంటి అద‌న‌పు హంగులు ఎన్నో ఉన్నాయి.

ఏప్రిల్‌లో `ది సన్ యుఎస్` మ్యాగ‌జైన్ ప్రియాంక - నిక్ మాన్షన్ కొత్త ఏరియ‌ల్ ఫోటోలను విడుదల చేసింది. ఆ ఇంటికి రిపేర్లు పూర్త‌యిన తర్వాత లుక్ ని ఈ ఫోటోలు రివీల్ చేసాయి. ఈ ఏరియల్ షాట్‌లు ఇల్లు దాదాపు పూర్తి కావొచ్చింద‌ని వెల్ల‌డించాయి. ఫిబ్రవరి 2024లో పేజ్ సిక్స్ క‌థ‌నం ప్ర‌కారం.. నీటి లీకేజీ డ్యామేజీల‌ కారణంగా తమ ఇంటిని బలవంతంగా ఖాళీ చేయవలసి వచ్చిన తర్వాత ఈ జంట ఇంటిని అమ్మిన‌ య‌జ‌మానిపై దావా వేశారు. 2018 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో వారి గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత 2019లో ఈ ఇంటిని కొనుగోలు చేశారు. కానీ ఈ ఇల్లు టెర్ర‌ర్ గా మారింది. జీవించడానికి అనువుగా లేనిదిగా మారింది. ఆ ఇంట్లో ఏప్రిల్ 2020లోనే సమస్యలు ప్రారంభమైనట్లు ఫేజ్ 6లో ఒక క‌థ‌నం వెలువ‌డింది. పూల్ - స్పా ఈ రెండిటికి పోరస్ వాటర్‌ఫ్రూఫింగ్ చేసారు. కానీ నీటి లీకేజీ స‌మ‌స్య త‌లెత్తింది. అదే సమయంలో వారి డెక్‌లోని బార్బెక్యూ ప్రాంతంలో నీటి లీక్ కనిపించింది. దిగువన ఉన్న ఇంటీరియర్ లివింగ్ ఏరియాలో కొంత భాగం దెబ్బతింది. ఈ సమస్యలు నివాస‌యోగ్యం కాని విధంగా మార్చాయి. ఇలాంటి ఇంట్లో నివశించ‌డం అన్నివిధాలా ప్ర‌మాద‌క‌రం అని నిక్- పీసీ జంట భావించారు.

Tags:    

Similar News