రెట్రో మూవీకి ఏడాది.. నాటి జ్ఞాపకాలను షేర్ చేసిన పూజా హెగ్డే!

ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్టైన్మెంట్ పతాకాలపై జ్యోతిక, కార్తికేయ సంతానం, రాజశేఖర్ పాండియన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం రెట్రో.;

Update: 2026-05-01 14:30 GMT

ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్టైన్మెంట్ పతాకాలపై జ్యోతిక, కార్తికేయ సంతానం, రాజశేఖర్ పాండియన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం రెట్రో. సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా, జోజు జార్జ్, నాజర్, ప్రకాష్ రాజ్ , జయ రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ.. 2025 మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టి కం బ్యాక్ అందుకోవాలని అటు పూజా హెగ్డే.. ఇటు కంగువా డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టాలని సూర్య కూడా భారీగా పరితపించారు. కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇకపోతే నేటికి ఈ సినిమా విడుదలై ఏడాది కావడంతో షూటింగ్ సెట్లో జరిగిన విషయాలను, జ్ఞాపకాలుగా మళ్లీ ఏడాది పూర్తయిన సందర్భంగా షేర్ చేసింది పూజా హెగ్డే.

రెట్రో సినిమా షూటింగ్ సమయంలో జరిగిన పడవ ప్రమాదానికి సంబంధించిన విషయాలను తాజాగా షేర్ చేసుకుంది పూజా హెగ్డే. "పాములతో నిండిన ఒక ద్వీపంలో మేము షూటింగ్ చేస్తున్నాము. అక్కడ అనుకోకుండా తుఫాను విజృంభించడంతో సముద్రపు అలలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి. దాంతో పడవ యొక్క లిగమెంట్ చిరిగిపోయింది. చుట్టూ బురద..మా పడవకి కూడా నిప్పంటుకోవడంతో అందరం భయపడిపోయాము. కానీ ఆ పరిస్థితి అక్కడ అలా లేదు.

ప్రశాంతంగా ఉంది. మంచి అనుభవాలతో బోలెడన్ని నవ్వులతో కేవలం సినిమాపై ఉన్న ప్రేమతో.. ఏదో ఒకటి చేస్తున్నామనే భావన మాలో నిండిపోయింది. దీనంతటికీ కారణం సుహాస్. ఆయనే ఎప్పటికీ రియల్ హీరో" అంటూ అక్కడ జరగబోయే ప్రమాదాన్ని సునాయాసంగా గుర్తించి అరికట్టిన సుహాస్ కి థాంక్స్ చెబుతూ తీసిన ఆ వీడియోని పూజా హెగ్డే పంచుకుంది . ఇక నాటి జ్ఞాపకాలను గుర్తు చేయడంతో ప్రమాదం తప్పింది అంటూ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం పూజ హెగ్డే షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెట్రో సినిమా విషయానికి వస్తే.. రొమాంటిక్ యాక్షన్ ఫిలిం ప్రాజెక్ట్ గా ఈ సినిమాను తీసుకొచ్చారు. రెండు గంటల 40 నిమిషాల రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా కథలో గ్రిప్పింగ్ లేకపోవడం, హీరో హీరోయిన్ మధ్య సరైన లవ్ ట్రాక్ కనిపించకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఐలాండ్ కు పారివేలుకు ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇక్కడ వివరంగా చెప్పడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు అనిపించింది. కథ, స్క్రీన్ ప్లే రెట్రో సినిమాకి మైనస్ గా నిలిచాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు మాత్రం ఈ సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇకపోతే సూర్య, పూజ హెగ్డే లను డైరెక్టర్ చాలా కొత్తగా చూపించారని చెప్పవచ్చు.

Tags:    

Similar News