• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ - హృతిక్ 'వార్...

ఎన్టీఆర్ - హృతిక్ 'వార్ 2' రిలీజ్ తేదీ ఫిక్స్

| 2025 గణతంత్ర దినోత్సవం వారాంతంలో ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ని విడుద‌ల చేయాల‌ని నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-01 03:00 GMT

YRF స్పై యూనివర్స్ భారతీయ సినిమాను మ‌రోస్థాయికి చేర్చే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఈ విశ్వం నుంచి వ‌రుస‌గా సినిమాలు సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ జూనియర్ ప్రధాన పాత్రలలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొంద‌నున్న 'వార్ 2' షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. 2025 గణతంత్ర దినోత్సవం వారాంతంలో ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ని విడుద‌ల చేయాల‌ని నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. రిపబ్లిక్ డే వీకెండ్ హిందీ చలనచిత్ర పరిశ్రమలో స‌రికొత్త రికార్డులు ఆవిష్కృత‌మ‌య్యే సీజ‌న్ గా భావిస్తున్నారు. ప్ర‌తిసారీ రిప‌బ్లిక్ డే వీకెండ్ హిందీ సినిమాల‌కు క‌లిసి వ‌స్తోంది. అగ్నిపథ్ - పఠాన్ లాంటి చిత్రాల‌కు ఈ వీకెండ్ పెద్ద ప్ల‌స్ అయింది. హృతిక్ -YRF ఆదిత్య‌ ఇద్దరూ ఈ తేదీన విజయాన్ని సాధించారు. ఇప్పుడు రిపబ్లిక్ డే 2025 విడుదల తేదీని పరిశీలించేందుకు ఇదే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. వార్ 2 తర‌హాలోనే... హృతిక్ న‌టించిన ఫైట‌ర్‌ 2024 రిప‌బ్లిక్ డే వారాంతంలో విడుదల కానుంది.

ఈ విడుదల వ్యవధిని దృష్టిలో ఉంచుకుని 'వార్ 2' మొత్తం షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి ఇది తాత్కాలిక విడుద‌ల‌ తేదీగా భావించాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని పనులు జరుగుతాయి. అయితే నవంబర్‌లో వార్ 2 చిత్రం సెట్స్‌పైకి వచ్చిన తర్వాత మాత్రమే క‌చ్చితమైన రిలీజ్‌ తేదీని లాక్ చేస్తారని కూడా తెలిసింది. ప్రస్తుతానికి రిపబ్లిక్ డే ఓపెనింగ్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై YRF బృందం స్పష్టంగా ఉంది అని సోర్స్ చెబుతోంది.

దేశభక్తి నేపథ్య క‌థాంశం కావ‌డంతో వార్ 2 కి రిప‌బ్లిక్ డే రిలీజ్ స‌రైన‌దేన‌ని యూనిట్ న‌మ్ముతోంది. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ లో నేరుగా అడుగుపెడుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ దీనిని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి న‌టిస్తున్నారు. హృతిక్ రోషన్ వ‌ర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫేసాఫ్ మ‌రో లెవ‌ల్లో సాగ‌నుంద‌ని, విలన్ గా యంగ్ య‌మ విశ్వ‌రూపాన్ని వీక్షించేందుకు అవ‌కాశం ఉంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లో YRF స్పై యూనివర్స్ తదుపరి చిత్రం 'టైగర్ 3' వ‌స్తుంది. తర్వాత టైగర్ vs పఠాన్ కూడా విడుద‌ల కావాల్సి ఉంది. మొత్తానికి 2024 రిప‌బ్లిక్ డే కి ఫైట‌ర్ విడుద‌ల‌వుతుండ‌గా.. 2025 రిప‌బ్లిక్ డే సీజ‌న్ లో వార్ 2 విడుద‌ల తేదీ ఖాయమైన‌ట్టేన‌ని భావించాలి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Yashrajfilms 
  • Yrfspyuniverse 
  • Hrithikroshan 
  • Ntr 
  • Siddharthanand 
  • War2movie 
  • War2 
  • Releasedate 
  • Republicday 
  • Fighter 
  • Devara 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS