నితిన్ అంతకుమించి!

ముఖ్యంగా 2021 లో వచ్చిన చెక్ సినిమా కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు

Update: 2024-04-30 11:30 GMT

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరోలలో నితిన్ టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో అయితే నితిన్ కాస్త ప్రయోగాలు చేసి బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫలితాలను ఎదుర్కొన్నాడు. 2020లో వచ్చిన భీష్మతో కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న నితిన్ ఆ తర్వాత మళ్లీ కనీసం యావరేజ్ సక్సెస్ కూడా సొంతం చేసుకోలేకపోయాడు.

ముఖ్యంగా 2021 లో వచ్చిన చెక్ సినిమా కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు. ఇక తర్వాత రంగ్ దే సినిమా అంతంతమాత్రంగానే ఆడింది. ఆ తర్వాత వచ్చిన మాస్ట్రో సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అనంతరం మళ్లీ కమర్షియల్ ఫార్మాట్లో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

కానీ ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. ఇక ఈ ఏడాది వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా దారుణంగా దెబ్బ కొట్టింది. నితిన్ గత నాలుగు సినిమాలు కూడా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకురాలేకపోయాయి అయినప్పటికీ కూడా అతనికి అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి మొన్నటి వరకు కాస్త హోమ్ ప్రొటెక్షన్ లోనే సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఈ హీరో ఇప్పుడు మాత్రం బయట నిర్మాతలతో సినిమా చేస్తున్నాడు.

అది కూడా మైత్రి మూవీ మేకర్స్ దిల్ రాజు లాంటి నిర్మతల సపోర్టుతో నితిన్ సినిమాలు వస్తూ ఉండడం విశేషం. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుతో తమ్ముడు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో కూడా యాక్షన్ ఎలెమెంట్స్ గట్టిగానే ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు 60 కోట్లతోనే సినిమా రూపొందుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more!

అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో కూడా వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ కూడా తక్కువ ఏమి కాదు. దాదాపు 60 కోట్లకు లెక్క వెళుతున్నట్లుగా రీసెంట్ గా ఒక టాక్ అయితే వినిపించింది. అంటే ఈ రెండు సినిమాలపైనే నితిన్ మీద నమ్మకంతో దాదాపు 120 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు చేస్తున్నారు.

చివరి ఐదు సినిమాలతో అంతగా సక్సెస్ చూడకపోయినా కూడా నితిన్ పై ఈ స్థాయిలో రిస్క్ చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో హిట్ టాక్ వచ్చినా కూడా పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందో లేదో తెలియమి పరిస్థితి. సాలిడ్ లాభాలు రావాలి అంటే టాప్ మాత్రం సినిమా టాక్ అంతకుమించి అనేలా పాజిటివ్ గా ఉండాలి. మరి నితిన్ లక్కు ఈసారి ఎలాంటి యు టర్న్ తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News