'నారీ నారీ నడుమ మురారి'.. బాక్సాఫీస్ లెక్క ఎంతవరకు వెళ్లిందంటే..

లిమిటెడ్ థియేటర్లలో విడుదలైనప్పటికీ, 'నారీ నారీ నడుమ మురారి' బాక్సాఫీస్ వద్ద ఎక్స్‌లెంట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.;

Update: 2026-01-21 12:39 GMT

యంగ్ హీరో శర్వానంద్ సంక్రాంతి రేసులో తనదైన ముద్ర వేస్తున్నారు. లిమిటెడ్ థియేటర్లలో విడుదలైనప్పటికీ, 'నారీ నారీ నడుమ మురారి' బాక్సాఫీస్ వద్ద ఎక్స్‌లెంట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ అయిన ఈ చిత్రం, ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి లాభాల్లోకి వచ్చేసింది. శర్వానంద్ కెరీర్‌లో మరో డీసెంట్ హిట్ చేరిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో వర్కింగ్ డేస్‌లో సినిమా వసూళ్లు సహజంగానే కొంత తగ్గాయి. ఐదో రోజు ఒక కోటి రూపాయల షేర్ సాధించిన ఈ చిత్రం, ఆరో రోజుకి వచ్చేసరికి కొంచెం డ్రాప్స్ చూపెట్టింది. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 లక్షల షేర్ రాగా, ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల రేంజ్ లో షేర్ సాధించి తన పట్టును నిలబెట్టుకుంది. పెద్ద సినిమాల మధ్య ఈ స్థాయి హోల్డ్ చూపించడం మంచి విషయమే.

వసూళ్ల వివరాల్లోకి వెళ్తే.. ఆరు రోజులు పూర్తి చేసుకునే సరికి 'నారీ నారీ నడుమ మురారి' ప్రపంచవ్యాప్తంగా సుమారు 22.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కలిపి 8.69 కోట్ల షేర్ వసూలైంది. ఇందులో నైజాం ఏరియా నుంచి 3.31 కోట్లు, ఆంధ్రా నుంచి 4.60 కోట్ల షేర్ రావడం గమనార్హం. మాస్ సినిమాల హడావిడి ఉన్నా, శర్వా మార్క్ ఫ్యామిలీ డ్రామాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ బిజినెస్, ప్రాఫిట్స్ విషయానికి వస్తే, 10.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఆరు రోజుల్లోనే 12.19 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించి, ఇప్పటికే 1.94 కోట్ల లాభాలను క్లియర్ చేసింది. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. బయ్యర్లు అందరూ ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోవడంతో మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ముఖ్యంగా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ సుమారు 2.80 కోట్ల షేర్ వసూలైంది. కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కలిపి 70 లక్షల వరకు షేర్ రాబట్టింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, అందులోనూ శర్వానంద్ పర్ఫార్మెన్స్ బాగుండటంతో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ సినిమాను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

వర్కింగ్ డేస్‌లో డ్రాప్స్ ఉన్నా, సెకండ్ వీకెండ్‌లో మళ్ళీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి శర్వానంద్ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తున్నారు. సంక్రాంతి విన్నర్లలో ఒకరిగా నిలిచి, బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. మిగిలిన రన్‌లో ఈ సినిమా ఇంకెంత వరకు ప్రాఫిట్స్ పెంచుకుంటుందో చూడాలి. ఇప్పటికే 'బైకర్' లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్న శర్వాకు, ఈ హిట్ మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News