దృశ్యం 3: రాంబాబు రిటర్న్స్.. గెట్ రెడీ!
విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దృశ్యం 3' ప్రాజెక్ట్‌పై ఎట్టకేలకు ఒక సాలిడ్ క్లారిటీ వచ్చేసింది.;
విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దృశ్యం 3' ప్రాజెక్ట్‌పై ఎట్టకేలకు ఒక సాలిడ్ క్లారిటీ వచ్చేసింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెలుగులో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా గురించి నిర్మాత సురేష్ బాబు ఇచ్చిన అప్‌డేట్‌తో అన్ని రూమర్లకు చెక్ పడినట్లయింది.
'దృశ్యం' మొదటి రెండు భాగాలు మలయాళంలో సూపర్ హిట్ అయిన తర్వాతే తెలుగులో రీమేక్ అయ్యాయి. ఇప్పుడు మలయాళ వెర్షన్ షూటింగ్ ఫినిష్ చేసుకుని 2026 వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. అటు హిందీ వెర్షన్ కూడా అక్టోబర్ లోనే రాబోతోంది. ఈ క్రమంలో తెలుగు వెర్షన్ ఆలస్యం అవుతుందేమో అని అందరూ టెన్షన్ పడుతున్న తరుణంలో, సురేష్ బాబు నుంచి వచ్చిన ఈ న్యూస్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపింది.
అసలు విషయం ఏంటంటే, ఈ ఏడాది అక్టోబర్‌లో 'దృశ్యం 3' షూటింగ్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేయబోతున్నట్లు సురేష్ బాబు కన్ఫర్మ్ చేశారు. అంటే ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న సినిమాల షెడ్యూల్స్ ముగియగానే, రాంబాబు మళ్ళీ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి కెమెరా ముందుకు రాబోతున్నాడు. కేవలం అక్టోబర్ నుంచే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సురేష్ బాబు చెప్పడంతో ఇక అధికారిక ప్రకటన రావడమే మిగిలి ఉంది.
వెంకటేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన వెంటనే లేదా దీనికి పారలల్‌గా అక్టోబర్‌లో 'దృశ్యం 3' కోసం డేట్స్ కేటాయించే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్ వర్క్ ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయని తెలుస్తోంది.
మరోవైపు అనిల్ రావిపూడితో చేయాల్సిన సినిమాను 2027 సంక్రాంతికి ప్లాన్ చేశారు. అయితే 'దృశ్యం' లాంటి సినిమాలకు ఎక్కువ వర్కింగ్ డేస్ అవసరం ఉండదు కాబట్టి, త్రివిక్రమ్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యే లోపు రాంబాబు కథను ఫినిష్ చేయాలని వెంకీ టీమ్ భావిస్తోంది. ఇలా చేయడం వల్ల మిగతా భాషల వెర్షన్లు ఓటీటీలోకి వచ్చే లోపే తెలుగులో కూడా రిలీజ్ చేసే స్కోప్ ఉంటుంది.
విక్టరీ వెంకటేష్ తన లైనప్‌ను చాలా పక్కాగా సెట్ చేసుకుంటున్నారు. అటు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తూనే, ఇటు 'దృశ్యం' లాంటి సీరియస్ థ్రిల్లర్స్‌తో ఆడియన్స్‌ను థ్రిల్ చేయబోతున్నారు. అక్టోబర్ లో షూటింగ్ మొదలైతే, వచ్చే ఏడాది చివర్లో రాంబాబు మ్యాజిక్ మళ్ళీ థియేటర్లలో కనిపించొచ్చు. మరి ఈ థర్డ్ పార్ట్‌లో రాంబాబు ఫ్యామిలీని ఏ చిక్కులు చుట్టుముడతాయో చూడాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.