థాయ్‌లాండ్‌లో రాయ్ లక్ష్మీ రఫ్ఫా రఫ్ఫా
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాయ్ లక్ష్మీ ప్రస్తుతం సినిమాల కంటే తన అల్ట్రా లగ్జరీ లైఫ్ స్టైల్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.;
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాయ్ లక్ష్మీ ప్రస్తుతం సినిమాల కంటే తన అల్ట్రా లగ్జరీ లైఫ్ స్టైల్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. అక్కడ పచ్చని ప్రకృతి ఒడిలో, ఎగ్జోటిక్ లొకేషన్లలో విహరిస్తూ ఫుల్ చిల్ అవుతోంది. ఈ విహారయాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో రాయ్ లక్ష్మీ ఒక ప్రత్యేకమైన వాహనాన్ని నడుపుతూ కనిపిస్తోంది. దీనిని ఆల్ టెర్రైన్ వెహికల్ లేదా ఏటీవీ అని పిలుస్తారు. పచ్చని అడవులు, ఇరుకు సందులు, కొండ ప్రాంతాల్లో ప్రయాణించడానికి ఈ వాహనం ఎంతో అనువైనది. నాట్ లాస్ట్, జస్ట్ ఎక్స్ ప్లోరింగ్.. బార్న్ ఫర్ ది వైలడ్ అంటూ క్యాప్షన్లు ఇస్తూ ఈ సాహసోపేతమైన రైడ్‌ను లక్ష్మీ రాయ్ తెగ ఎంజాయ్ చేస్తోంది. చిట్టి పొట్టి డెనిమ్ షార్ట్స్ , బ్లాక్ ఇన్నర్ ధరించి తన బోల్డ్ లుక్స్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.
అయితే, గత ఐదారేళ్లుగా రాయ్ లక్ష్మీకి చెప్పుకోదగ్గ సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు లేకపోయినా, తను లీడ్ చేస్తున్న లగ్జరీ జీవితం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఖరీదైన విదేశీ యాత్రలు, అల్ట్రా మోడ్రన్ దుస్తులు, విలాసవంతమైన జీవనశైలికి ఆమెకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు.. కమర్షియల్ ఈవెంట్స్.. సోషల్ మీడియా ప్రమోషన్ల ద్వారా బాగానే ఆర్జిస్తోందని అంచనా వేస్తున్నారు.
వీటికి తోడు రాయ్ లక్ష్మీకి రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ప్రముఖ నటీనటులకు సినిమా రెమ్యునరేషన్‌తో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సింగ్ ద్వారా కూడా భారీ ఆదాయం లభిస్తుంది. రాయ్ లక్ష్మీకి ఉన్న మిలియన్ల కొద్దీ ఫాలోవర్ల కారణంగా టాప్ బ్రాండ్స్ ఈ బ్యూటీతో కొలాబరేట్ అవుతుంటాయి. దీనివల్ల వెండితెరపై కనిపించకపోయినా ఆర్థికంగా చాలా బలంగానే సపోర్ట్ ఉందని అర్థమవుతోంది.
సినిమా కెరీర్ విషయానికి వస్తే.. రాయ్ లక్ష్మీ ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. తను నటించిన కొన్ని పెండింగ్ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించి రెండు భారీ బడ్జెట్ సౌత్ ఇండియన్ సినిమాలతో పాటు, ఒక హిందీ వెబ్ సిరీస్‌పై సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో కొన్ని హారర్ థ్రిల్లర్ జోనర్ సినిమాలు కాగా.. మరికొన్ని యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలు కావడం విశేషం.
గ్యాంగ్‌స్టర్ 21 అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో పవర్‌ఫుల్ మహిళా గ్యాంగ్‌స్టర్ పాత్రలో రాయ్ లక్ష్మీ కనిపిస్తుందని సమాచారం. దీని కోసం ఆమె ప్రత్యేకంగా యాక్షన్ విన్యాసాల్లో శిక్షణ కూడా తీసుకుంది. ఈ సినిమా 2026 ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బాడీ అనే హిందీ సిరీస్ జూన్ లో స్ట్రీమింగుకి రానుంది. శిర్వానీ అనే హారర్ థ్రిల్లర్ లోను నటిస్తోంది. ఇది తమిళం -తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. దీని రిలీజ్ డేట్ 2026 డిసెంబర్ అని తెలుస్తోంది. గతంలో వచ్చిన సిండ్రెల్లా చిత్రానికి సీక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం.
మొత్తానికి రాయ్ లక్ష్మీ తన కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది. అల్ట్రా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సరైన కథల కోసం వేచి చూస్తూ మళ్లీ వెండితెరపై తన మ్యాజిక్ రిపీట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం లక్ష్మీ షేర్ చేస్తున్న వైల్డ్ ఎక్స్‌ప్లోరేషన్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.