ది ప్యారడైజ్.. అసలైన ఛాలెంజ్ ఇదే
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలా కాంబినేషన్ అనగానే జనాల్లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి.
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలా కాంబినేషన్ అనగానే జనాల్లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. దసరా సినిమాతో ఈ కాంబో క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది. ఇప్పుడు వీరి కలయికలో రాబోతున్న 'ది ప్యారడైజ్' సినిమా టీజర్ ఆగస్టు 6న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ ప్రమోషనల్ కట్ కి ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురుకాబోతోంది. కేవలం మన తెలుగు ఆడియన్స్ ని మాత్రమే కాకుండా, గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించాల్సిన సవాల్ మేకర్స్ ముందు ఉంది.
అయితే ఏ సినిమాకైనా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక చిన్న నెగిటివ్ కామెంట్ రావడం కామన్. కానీ ది ప్యారడైజ్ విషయంలో అలా జరగలేదు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అయినా, ఆ తర్వాత వచ్చిన ఆయా షేర్ సాంగ్ అప్డేట్ అయినా జనాల్లోకి చాలా పాజిటివ్ గా వెళ్లాయి. ఎక్కడా చిన్న నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అనేది రాలేదు. దీనివల్ల కంటెంట్ పై ఫ్యాన్స్ లో అంచనాలు చాలా గట్టిగా పెరిగిపోయాయి.
ఇక మేకర్స్ ముందు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే, ఈ పాజిటివ్ వైబ్ ని ఇదే స్థాయిలో కంటిన్యూ చేయడం. ఆగస్టు 6న రాబోయే టీజర్ తో జనాల్లో ఉన్న నమ్మకాన్ని ఇంకాస్త పెంచితే చాలు, ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో గట్టిగా నిలబడటం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. నాని నార్మల్ గా చేసే క్లాస్ సినిమాలకు వేరే లెవెల్ మార్కెట్ ఉంటుంది. కానీ ఇలాంటి యాక్షన్ సినిమాతో నార్త్ ఆడియన్స్ ని కూడా కనెక్ట్ చేయడం అనేది శ్రీకాంత్ ఒదెలా ముందున్న బిగ్ టాస్క్.
నాని ఈ సినిమాలో జాడల్ అనే ఒక పక్కా రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన షర్ట్ లెస్ గా చేసిన యాక్షన్ సీన్స్ ఈ టీజర్ లో హైలైట్ కాబోతున్నాయని టాక్. దీనికి తోడు బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్, సీనియర్ నటుడు మోహన్ బాబు లాంటి వాళ్లు ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చే అంశం. వీళ్లందరినీ టీజర్ లో ఎలా చూపిస్తారు, ఆ విజువల్స్ కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తారు అనే దానిపైనే సినిమా బిజినెస్ రేంజ్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది.
నాని సినిమాలకు ఓవర్సీస్ లో ఉండే మార్కెట్ వేరు. అక్కడి క్లాస్ ఆడియన్స్ ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, అదే టైమ్ లో లోకల్ మాస్ ఆడియన్స్ కి కావాల్సిన రస్టిక్ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయడమే ఇక్కడ ఉన్న అసలు ఛాలెంజ్. ఈ రెండు విభిన్నమైన టేస్ట్ లను ఒకే వీడియోలో పర్ఫెక్ట్ గా కుదిరిస్తే, పాన్ ఇండియా లెవెల్ లో సినిమాకు తిరుగుండదు. ఇప్పటికైతే ప్రమోషన్స్ పరంగా టీమ్ చాలా సేఫ్ జోన్ లో ఉంది. టీజర్ కట్ తో గ్లోబల్ ఆడియన్స్ కి కూడా రీచ్ అయ్యేలా ఆ క్వాలిటీ, కంటెంట్ ఉంటే సినిమాకు సూపర్ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ. మరి శ్రీకాంత్ ఒదెలా ఈ ఛాలెంజ్ ని ఎలా ఫేస్ చేస్తారు అనేది తెలియాలంటే ఆగస్టు 6 వరకు వెయిట్ చేయాల్సిందే.