వారణాసి లీక్స్.. ఓటీటీ ప్లాన్స్ మ్యాటరేంటి?
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా రిలీజ్ డేట్ పై ఈమధ్య రకరాలుగా వార్తలు వైరల్ అయ్యాయి.
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా రిలీజ్ డేట్ పై ఈమధ్య రకరాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. సినిమా ఆలస్యం అవుతుందేమో అనే డౌట్స్ చాలామందిలో ఉండేవి. కానీ అవన్నీ నిజం కాదని, అనుకున్నట్లే 2027 ఏప్రిల్ 7న ఉగాది పండుగ రోజే థియేటర్లలోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డేట్ పై ఒక క్లారిటీ రావడం వల్ల ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల చుట్టూ కొత్త చర్చలు షురూ అయ్యాయి.
ఏ పెద్ద సినిమాకైనా థియేటర్లలో రిలీజ్ అయ్యే టైమ్ ఫిక్స్ అయితేనే ఓటీటీ వాళ్ళు తమ స్ట్రీమింగ్ డేట్స్ ని ప్లాన్ చేసుకుంటారు. సినిమా రావడానికి ఇంకా ఎనిమిది నెలలకు పైగానే సమయం ఉంది. కాబట్టి ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమ్ చేయాలనే ప్లాన్స్ ని మేకర్స్ ఎలా సెట్ చేస్తారనేదే అసలు పాయింట్. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ డిజిటల్ డీల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఇండస్ట్రీలో రకరకాల అంచనాలు ఉన్నాయి.
ఇప్పటి సినిమాల ట్రెండ్ చూస్తే థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ రాజమౌళి సినిమాలకు థియేటర్లలోనే చాలా కాలం జనాలు వస్తుంటారు. అందువల్ల ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసిన చాలా రోజుల తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేసేలా అగ్రిమెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఆ టైమ్ లోనే కలెక్షన్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి మేకర్స్ తొందరపడి ఓటీటీకి ఇచ్చేలా కనిపిచడం లేదు.
పెద్ద బడ్జెట్ తో వస్తున్న ఇలాంటి భారీ సినిమాలకు డిజిటల్ హక్కుల ద్వారా వచ్చే మనీ చాలా హెల్ప్ అవుతుంది. ఏప్రిల్ లో థియేటర్లలోకి వస్తే, మే నెల మొత్తం సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ టైమ్ లో డిజిటల్ లో రాకుండా ఉండేలా ప్లాన్ చేసే అవకాశం ఉంది. థియేటర్ రన్ పూర్తయ్యే వరకు డిజిటల్ స్ట్రీమింగ్ ఆపి ఉంచడమే ప్రొడ్యూసర్లకు మంచిది. అందుకే ఆ గ్యాప్ ఎక్కువగా ఉండేలాగే ప్లాన్ చేస్తున్నారు.
ఇక్కడ మరో హైలెట్ ఏంటంటే, ఈ సినిమాను వేర్వేరు దేశాల్లో, వేర్వేరు భాషల్లో విడుదల చేస్తున్నారు. అన్ని భాషల ఓటీటీ హక్కులు ఒకే కంపెనీకి ఇస్తారా లేక వేర్వేరు లాంగ్వేజెస్ కి వేర్వేరుగా అమ్ముతారా అనే ప్రచారం కూడా నడుస్తోంది. ఒక్కో భాషకు ఒకలా డీల్ సెట్ చేస్తే ప్రొడ్యూసర్లకు వచ్చే నాన్ థియేట్రికల్ ఇన్ కమ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి.
ఇక వారణాసి రిలీజ్ డేట్ పై వచ్చిన అప్‌డేట్ వల్ల ఓటీటీ బిజినెస్ కి ఒక క్లారిటీ వచ్చింది. మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక వివరాలు బయటపెట్టకపోయినా, ఈ సినిమా డిజిటల్ హక్కుల వాల్యూ ఎంతవరకు వెళ్తుందో అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు. సినిమా రావడానికి ఇంకా టైమ్ ఉంది కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ ఓటీటీ డీల్స్ ఎలా ఫైనల్ అవుతాయో చూడాలి.