రశ్మికకు గాయం.. అప్పటి వరకు రెస్ట్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Update: 2026-07-31 18:05 GMT

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఆమె ఒక సినిమా షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. ఒక డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రశ్మికకు ఈ గాయం అయినట్లు సమాచారం. అన్ని సినిమాల షూటింగ్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు రశ్మికకు ఇలా కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

గత కొద్ది రోజులుగా రశ్మిక 'రణబాలి', 'మైసా' సినిమాల షూటింగ్స్‌లో కంటిన్యూస్‌గా పాల్గొంటున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్‌లు, హెవీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు చేయడం వల్ల ఈ గాయం అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రశ్మిక హిప్ ఏరియాలో 'టెండన్ డిటాచ్‌మెంట్' అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అలాగే ఆమెకు తీవ్రమైన నొప్పి వచ్చినట్లు సమాచారం.

అయితే ఇలాంటి గాయాలు నిత్యం కఠినమైన శిక్షణ తీసుకునే ప్రొఫెషనల్ అథ్లెట్స్ లేదా స్పోర్ట్స్ పర్సన్స్‌కే అవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఒక నటికి ఈ స్థాయిలో టెండన్ డిటాచ్‌మెంట్ అవ్వడం చూస్తే ఆమె హార్డ్ వర్క్ ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి రశ్మికకు కనీసం ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.

రెస్ట్ మాత్రమే కాకుండా, దెబ్బతిన్న టెండన్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చి బలం పుంజుకోవడానికి ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ కూడా తప్పనిసరి అని డాక్టర్లు స్పష్టం చేశారనీ తెలుస్తోంది. దీంతో ఆమె కొంతకాలం షూటింగ్స్‌కు దూరంగా ఉండనున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఉన్న రశ్మిక చేతిలో నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.

అలాగే దాదాపు 30కి పైగా ప్రముఖ బ్రాండ్స్‌కు ఆమె అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్లు ఆరు వారాల రెస్ట్ చెప్పడంతో, ఆమెకు సంబంధించిన సినిమా షెడ్యూల్స్‌తో పాటు పలు కమర్షియల్ యాడ్స్ షూటింగ్స్ కూడా తాత్కాలికంగా బ్రేక్ పడనున్నాయి. దీంతో ఆమెకు సంబంధించిన షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో రశ్మికకు ఈ గాయం కావడంతో ఆమె సినిమాలు, ప్రకటనల షూటింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. రశ్మిక త్వరగా ఈ గాయం నుంచి కోలుకుని మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News