దుల్కర్ ను చూసి అందరూ నేర్చుకోవాల్సిందే!
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే స్టార్లుగా మారాలనే ప్రయత్నిస్తుంటారు. ఒక యాక్టర్ కు స్టార్ స్టేటస్ వచ్చిందంటే అదే తన బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్ గా ఫీలవుతుంటారు.;
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే స్టార్లుగా మారాలనే ప్రయత్నిస్తుంటారు. ఒక యాక్టర్ కు స్టార్ స్టేటస్ వచ్చిందంటే అదే తన బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్ గా ఫీలవుతుంటారు. కానీ అసలు ఎలాంటి కథలను ఎంచుకోవాలి? ఆడియన్స్ కు ఎలాంటి సినిమాలు నచ్చుతాయనేది బేరీజు వేసుకోవడమే వారిని స్టార్‌డమ్ వైపు అడుగులు పడేలా చేస్తుంది.
కథల ఎంపిక విషయంలో దుల్కర్ భిన్నం
స్టోరీ సెలెక్షన్ విషయంలో ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న వాళ్లు కూడా కొన్నిసార్లు ఫెయిలవుతుంటారు. అందరికీ ఈ సెలెక్షన్ లో ప్రావీణ్యం ఉండదు. కానీ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మాత్రం స్టోరీ సెలెక్షన్ విషయంలో మిగిలిన అందరి కంటే భిన్నంగా కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఆయన సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు, ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు ఈ విషయాన్ని చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చేస్తున్నాయి.
డిజాస్టర్ సినిమాలను వదులుకున్న దుల్కర్
రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అతి పెద్ద డిజాస్టర్ల ను దుల్కర్ తెలివిగా వదిలేయడం ఆయన్ని అందరిలా కాదని తెలియచేస్తుంది. మామూలుగా ఎవరైనా సరే ఒక సక్సెస్ వచ్చినప్పుడు తర్వాతి సినిమా విషయంలో కథ గురించి పెద్దగా ఆలోచించకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. కానీ దుల్కర్ అలా కాదు. కథ విషయంలో ఆయన చాలా పర్టిక్యులర్ గా ఉంటారని ఇండియన్2, థగ్ లైఫ్, పరాశక్తి లాంటి సినిమాలను వదులుకోవడం ద్వారా తెలుస్తోంది.
మొదట్లో ఈ సినిమాలను రిజెక్ట్ చేసినందుకు దుల్కర్ పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఆయా సినిమాలు రిలీజైన తర్వాత అందరికీ దుల్కర్ నిర్ణయమే కరెక్ట్ అనిపించింది. ఇండియన్2, థగ్ లైఫ్ లాంటి సినిమాలకు స్టార్ డైరెక్టర్లు దర్శకత్వం వహిస్తున్నారని తెలిసి కూడా దుల్కర్ తొందరపడలేదు. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్న దుల్కర్ ఆ సినిమాలను వదిలేసి మంచి పని చేశారని ఇప్పుడందరూ అంటున్నారు. ఈ విషయంలో మిగిలిన స్టార్లు కూడా దుల్కర్ లాగానే కథల విషయంలో జాగ్రత్తలు ఆలోచిస్తే చాలా వరకు డ్యామేజ్ ను కంట్రోల్ చేసే అవకాశముంది. ఇక దుల్కర్ కెరీర్ విషయానికొస్తే రీసెంట్ గా కాంత మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన దుల్కర్, ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని డైరెక్షన్ లో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నారు.