వారణాసి.. ఆ డౌట్ ఇక అక్కర్లేదు!

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;

Update: 2026-01-21 07:44 GMT

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా చుట్టూ రోజుకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తిరుగుతోంది. గ్లోబ్ ట్రాటింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీ విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో అని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

​సాధారణంగా రాజమౌళి సినిమాలంటే షూటింగ్ పనులు చాలా కాలం పాటు సాగుతుంటాయి. దీనివల్ల సినిమాలు అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావని చాలా మందిలో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. గతంలో 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' సినిమాల విషయంలో కూడా రిలీజ్ డేట్స్ మారడం మనం చూశాం. అయితే మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం అలాంటి సందేహాలకు తావులేకుండా టీమ్ ముందే క్లారిటీ ఇస్తోంది.

​ఈ క్రమంలోనే 'వారణాసి' అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఒక సరికొత్త అప్‌డేట్‌ను షేర్ చేశారు. గతంలో రిలీజ్ చేసిన కాన్సెప్ట్ గ్లింప్స్ విజువల్స్‌ను మరోసారి హైలెట్ చేస్తూ, ఈ సినిమా 2027లోనే వస్తుందని గట్టిగా చెప్పారు. అంటే సినిమా ఆలస్యం అవుతుందేమో అని భయపడే ఫ్యాన్స్‌కు జక్కన్న టీమ్ ఒక పక్కా క్లారిటీ ఇచ్చిందని చెప్పవచ్చు. గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ లో చెప్పినట్లే 2027 ఫిక్స్‌డ్ అని మళ్ళీ గుర్తు చేశారు.

​మహేష్ బాబు ఇందులో రుద్ర అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాను రాజమౌళి విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉండటంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. శ్రీరామ నవమి కానుకగా 2027 ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

​రాజమౌళి తన సినిమాల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి, ప్రతి ఫ్రేమ్‌ను చాలా పక్కాగా డిజైన్ చేస్తున్నారు. షూటింగ్ దశలోనే ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా రిలీజ్ టైమ్‌కి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. ఎప్పటికప్పుడు ఇలాంటి క్లారిటీ ఇవ్వడం వల్ల ఫ్యాన్స్‌లో ఉన్న కన్ఫ్యూజన్ తగ్గి, సినిమాపై మరింత పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. జక్కన్న తన ప్లానింగ్‌తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు.

​ఇక 'వారణాసి' రిలీజ్ విషయంలో రాజమౌళి అండ్ టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. 2027లో ఈ సినిమా ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పడం ఖాయం. మహేష్ బాబు మేకోవర్, ఆ గ్లోబల్ యాక్షన్ సీక్వెన్స్ వెండితెరపై ఎలా ఉంటాయో చూడాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.




Tags:    

Similar News