సూర్య- వెంకీ మూవీ రీమేకా? అసలు నిజం ఏంటంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఇప్పుడు తెలుగు ఫస్ట్ స్ట్రయిట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2026-03-07 17:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఇప్పుడు తెలుగు ఫస్ట్ స్ట్రయిట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే సినిమా టైటిల్ ప్రకటించిన కొద్ది రోజులకే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఆ చిత్రం ఒరిజినల్ కథ కాకుండా రీమేక్ కావచ్చని ప్రచారం జరుగుతోంది. కొందరు నెటిజన్లు ఇది బాలీవుడ్‌ మూవీ కపూర్ అండ్ సన్స్ ఆధారంగా తెరకెక్కుతోందని ఆరోపిస్తున్నారు. మరికొందరు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కంగారూ మూవీ రీమేక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

దీంతో సూర్య తెలుగు తొలి స్ట్రయిట్ ప్రాజెక్ట్‌ పై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మూవీ టీమ్ తాజాగా రెస్పాండ్ అయింది. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఏ ఇతర భాషా చిత్రానికి రీమేక్ కాదని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా దర్శకుడు వెంకీ అట్లూరి రాసిన ఒరిజినల్ కథ అని పేర్కొంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది.

అయితే మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం, వెంకీ అట్లూరి ఆ కథను ప్రత్యేకంగా సూర్య కోసం రూపొందించారని సమాచారం. కథ విన్న వెంటనే సూర్యకు అది ఎంతో నచ్చిందని, అందుకే వెంటనే ఆ ప్రాజెక్ట్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో పాటు ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ వంటి ఎలిమెంట్స్ తో కూడిన కథతో సినిమా రూపొందుతోందని తెలుస్తోంది.

అదే సమయంలో సూర్య కెరీర్‌ లో ఇదొక స్పెషల్ ప్రాజెక్ట్‌ గా నిలిచే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఆయన ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించినప్పటికీ, ఆయన చిత్రాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. అందుకే ఆయన స్ట్రయిట్ తెలుగు మూవీ చేయడం ఆసక్తి పెంచింది. మరోవైపు దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవల చేసిన సినిమాలు విజయాలు సాధించాయి.

ఆయన కథల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఈక్వల్ గా ఉంటాయి. దీంతో సూర్యతో ఆయన చేస్తున్న ఆ ప్రాజెక్ట్‌ పై అంచనాలు పెరుగుతున్నాయి. నిర్మాతలు కూడా సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారని సమాచారం. ఏదేమైనా ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రీమేక్ కాదని చిత్ర బృందం స్పష్టం చేయడంతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలకు చెక్ పడినట్లయింది. మరి ఒరిజినల్ కథతో రూపొందుతున్న ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News