ఆ కార్ స్నేహారెడ్డి కోసం.. బన్ని సర్‌ప్రైజ్ గిఫ్ట్
వారి పెళ్లి వార్షికోత్సవాల సందర్భంగా ఖరీదైన డైమండ్ జ్యువెలరీతో పాటు.. తనకు ఇష్టమైన అంతర్జాతీయ టూర్లను ప్లాన్ చేయడం బన్నీకి అలవాటు.;
అల్లు శిరీష్ - నైనికల వివాహ వేడుక అల్లు కుటుంబంలో కొత్త ఉత్సాహాన్ని నింపగా.. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తమ్ముడి పెళ్లి పనుల్లో అన్నీ తామే అయి వ్యవహరించిన అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతుల ఇంట వేడుకలు డబుల్ ధమాకాగా మారాయి. ఈ రోజు ఉదయమే అల్లు అర్జున్ ఇంటి వద్ద ఒక కంటైనర్ నుండి సరికొత్త మెరిసిపోయే బ్లాక్ కలర్ బెంజ్ కార్ దిగడం అందరి దృష్టిని ఆకర్షించింది. మొదట ఇది తమ్ముడు శిరీష్‌కు పెళ్లి కానుక అని అందరూ భావించినా కానీ, అసలు విషయం తెలిశాక అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఈ ఖరీదైన లగ్జరీ కార్ మరెవరికో కాదు.. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అని తేలింది. వీరిద్దరూ వివాహం చేసుకుని విజయవంతంగా 15 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో బన్నీ తన భార్యపై ఉన్న ప్రేమను ఇలా ఖరీదైన కానుకతో చాటుకున్నారు. ఒకవైపు తమ్ముడి పెళ్లి సంబరాలు.. మరోవైపు తమ యానివర్శరీ ఈవెంట్ ..మొత్తానికి కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడే బన్నీ, ఈ మైలురాయిని గుర్తుండిపోయేలా ప్లాన్ చేశారు.
ఈ కొత్త బెంజ్ కార్ విషయానికి వస్తే.. ఇది లేటెస్ట్ మోడల్ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ సిరీస్‌కు చెందినదని సమాచారం. దీని ధర మార్కెట్లో సుమారు 1.5 కోట్ల నుండి 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అత్యున్నతమైన సేఫ్టీ ఫీచర్లు, విలాసవంతమైన ఇంటీరియర్ .. పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కూడిన ఈ కార్ స్నేహారెడ్డి అభిరుచికి తగ్గట్టుగా ఉంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఎం-బక్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్.. పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత లగ్జరీగా మారుస్తాయి.
అల్లు వారి కార్ గ్యారేజీలో ఇప్పటికే అనేక ఖరీదైన వాహనాలు ఉన్నాయి.. కానీ స్నేహారెడ్డికి మాత్రం రేంజ్ రోవర్ వోగ్ అంటే చాలా ఇష్టం. గతంలో కూడా తను ఎక్కువగా ఈ కార్‌లోనే ప్రయాణిస్తూ కనిపించేవారు. ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన బెంజ్ కార్ ఆమె ఫేవరెట్ లిస్టులో చేరిపోయింది. స్నేహారెడ్డి వద్ద ఇప్పటికే వోగ్ తో పాటు ఒక ఆడి , మెర్సిడెస్ సెడాన్ కూడా ఉన్నట్లు సమాచారం. బన్నీ తన గ్యారేజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంటారు.. కానీ స్నేహ కోసం కొనే కార్ల విషయంలో మాత్రం చాలా ప్రత్యేకంగా వ్యవహరిస్తారు.
అల్లు అర్జున్ గతంలో కూడా స్నేహారెడ్డికి అనేక అరుదైన కానుకలను అందజేశారు. వారి పెళ్లి వార్షికోత్సవాల సందర్భంగా ఖరీదైన డైమండ్ జ్యువెలరీతో పాటు.. తనకు ఇష్టమైన అంతర్జాతీయ టూర్లను ప్లాన్ చేయడం బన్నీకి అలవాటు. అలాగే స్నేహారెడ్డికి ఫోటోగ్రఫీ అంటే ఉన్న ఆసక్తిని గమనించి.. ఒకసారి అత్యంత ఖరీదైన కెమెరా కిట్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్రతి ఏటా ఏదో ఒక వినూత్నమైన కానుకతో స్నేహను సంతోషపెట్టడం ఐకాన్ స్టార్‌కు ఉన్న ఒక స్వీట్ హ్యాబిట్.
మొత్తానికి.. అల్లు శిరీష్ పెళ్లి వేడుకల మధ్యలో స్నేహారెడ్డికి లభించిన ఈ `బెంజ్` సర్ప్రైజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట ఇలాగే కలకాలం అన్యోన్యంగా ఉండాలని మెగా - అల్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.