అనిరుధ్- కావ్య పెళ్లి: రిసెప్ష‌న్ ఇన్విటేష‌న్ అతిథుల జాబితా

ఈ ప్రత్యేకమైన రిసెప్షన్ కార్డ్‌ను `పింక్ విజిల్ మ్యాన్` సంస్థకు చెందిన ప్రముఖ డిజైనర్ రంజని అయ్యంగార్ ఎంతో కళాత్మకంగా రూపొందించారు.

Update: 2026-10-28 05:06 GMT

భారతీయ సినీ సంగీత రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్.ఆర్.హెచ్) అధినేత్రి కావ్యా మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గ్రీస్ న‌గ‌రంలో డెస్టినేష‌న్ స్ట‌యిల్ లో అత్యంత వేడుకగా జరగనున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ - రిసెప్షన్‌కు సంబంధించిన విశేషాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా వీరి వివాహ రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో లీక్ కావడంతో.. దాని రాయల్ డిజైన్ - డిఫరెంట్ వైబ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ ప్రత్యేకమైన రిసెప్షన్ కార్డ్‌ను `పింక్ విజిల్ మ్యాన్` సంస్థకు చెందిన ప్రముఖ డిజైనర్ రంజని అయ్యంగార్ ఎంతో కళాత్మకంగా రూపొందించారు. ఐవరీ - పౌడర్ బ్లూ రంగుల కలయికలో ప్రాచీన `వింటేజ్ బరోక్` థీమ్‌తో ఈ వెడ్డింగ్ బాక్స్‌ను డిజైన్ చేశారు. ఎంబోస్డ్ లెటరింగ్, రాయల్ క్రెస్ట్ సీల్‌తో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే క్లాసిక్ జ్ఞాపకంలా.. కనిపించే ఈ ఇన్విటేషన్ కార్డ్ రాజసానికి ప్రతీకగా నిలుస్తోంది.

నవంబర్ 21న చెన్నైలో జరగనున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు దేశంలోని అత్యున్నత రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వంటి అగ్ర రాజకీయ ప్రముఖులను మారన్ కుటుంబం, అనిరుధ్ తల్లిదండ్రులు స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.

రాజకీయ ప్రముఖులతో పాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలకు కూడా ఆహ్వానాలు అందాయి. అనిరుధ్ మేనమామ, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు అల్లు అర్జున్, అజిత్ కుమార్, శివకార్తికేయన్, ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ వంటి సినీ సెలబ్రిటీలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. క్రీడా రంగం నుండి ఐపిఎల్ ఫ్రాంచైజీల యజమానులు .. ప్రముఖ క్రికెటర్లు కూడా ఈ వేడుకకు తరలిరానున్నారు.

సమాచారం ప్రకారం.. వీరి వివాహ వేడుక నవంబర్ రెండవ వారంలో విదేశాలలో లేదా అత్యంత ప్రైవేట్ వాతావరణంలో జరగనుండగా.. నవంబర్ 21న చెన్నై నగరంలో అత్యంత వైభవంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. వ్యాపార, సంగీత, క్రీడా ప్రపంచాల కలయికగా మారుతున్న ఈ బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఈవెంట్ కోసం అభిమానులు- నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భార‌త‌దేశంలోని అత్యంత డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ తో బిజినెస్ రంగంలో అగ్ర‌గామిగా ఉన్న పారిశ్రామిక వేత్త కుమార్తె వివాహంపై సర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ముఖ్యంగా ర‌జనీకాంత్ (అనిరుధ్ మేన‌మామ‌) కుటుంబంతో క‌రుణానిధి కుటుంబం (మార‌న్ కుటుంబంతో రిలేష‌న్) బంధం బ‌ల‌ప‌డుతోంద‌నే ప్ర‌చారం కూడా హోరెత్తుతోంది.

Tags:    

Similar News