అనిల్ రావిపూడి తర్వాత మూవీ పై క్లారిటీ వచ్చేసినట్టేనా?
వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లతో చేస్తున్న 'జనవరి 12 విడుదల' షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది.
కమర్షియల్ సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చడం చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే సంవత్సరానికి 150 సినిమాలు రిలీజ్ అయితే అందులో కమర్షియల్ సినిమాల సంఖ్యే ఎక్కువ...కాబట్టి సక్సెస్ ఫుల్ సినిమా చేయడానికి కమర్షియల్ ఎలిమెంట్స్ ను కొత్తగా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో అనిల్ రావిపూడి ప్రతి సారి సక్సెస్ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సక్సెస్ గా నిలిచాయి. దాంతో అతనికి ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. ఇప్పటివరకు రాజమౌళి 12 వరుస విజయాలతో మొదటి స్థానం లో ఉంటే అనిల్ రావిపూడి 9 విజయాలతో ఆ తర్వాత స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
జనవరి 12 విడుదల పరిస్థితేంటి?
వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లతో చేస్తున్న 'జనవరి 12 విడుదల' షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా విషయంలో అనిల్ రావిపూడి చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. సినిమా లో ఫన్ తో పాటు యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తున్నాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరిని డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనేనా...
తదుపరి సినిమా విషయంలో అనిల్ రావిపూడి క్లారిటీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తన నెక్స్ట్ సినిమా కథ లైన్ ను రాసిపెట్టుకున్నారట. తన నెక్స్ట్ మూవీ బాలయ్య బాబుతో చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ కాంబోలో ఇంతకుముందే 'భగవంత్ కేసరి' మూవీ వచ్చింది. ఈ సినిమా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడాలని బాలయ్య అభిమానులు, అనిల్ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో నెక్స్ట్ మూవీ ని బాలయ్యతో చేయాలని అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'దాదా' సినిమా చేస్తున్నాడు. దాంతో పాటుగా కొరటాల శివ డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ప్రస్తుతం బాలయ్య రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి ప్రతి సంవత్సరం సంక్రాంతికి తన సినిమాని రిలీజ్ చేస్తాడు. 2027 సంక్రాంతికి జనవరి 12 విడుదల మూవీ రిలీజ్ అయ్యాక మరో సంక్రాంతి వరకు బాలయ్య బాబు తన డేట్స్ ని అనిల్ సినిమా మీద కేటాయించగలుగుతాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది... ఒకవేళ బాలయ్య డేట్స్ కుదరకపోతే ఆయన నాగార్జునతో సైతం సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరిద్దరిలో అనిల్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేయగలిగే హీరో ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...