14వ యానివర్సరీ.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన నాని, అంజు.. ఇద్దరి కలయిక మొదట ఎలా జరిగిందో తెలుసా?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. నేడు హీరోగా, నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. నేడు హీరోగా, నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. అద్భుతమైన నటనతో మరింత క్రేజ్ దక్కించుకున్న ఈయన.. ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరొకవైపు కొత్త కథలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. నూతన నటీనటులకు అవకాశం కల్పిస్తూ.. తన నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో మంచి మంచి చిత్రాలను నిర్మిస్తున్నారు. అంతేకాదు భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ అటు ఆర్థికంగా కూడా బాగా వెనకేసుకుంటున్నారు.
ఇకపోతే తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే.. తన కుటుంబానికి ప్రత్యేకించి ఒక సమయాన్ని కేటాయిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన భార్య అంజు, కొడుకు అర్జున్ తో కలిసి గడిపే మధుర క్షణాలను ఆయన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే నేడు ఈ జంట వైవాహిక బంధానికి 14 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఈ జంట తమ క్యూట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈ జోడి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎటువంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా తమ వైవాహిక జీవితంలో అన్యోన్యంగా గడుపుతున్న ఈ జంట.. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాదు సెలబ్రిటీలు , అభిమానులు, నెటిజన్స్ నాని, అంజు దంపతులకు 14వ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ జంటకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే వీరిద్దరిది ప్రేమ వివాహం అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ ప్రేమ పుట్టకముందు వీరిద్దరి మధ్య తొలి పరిచయం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీరిద్దరికీ విశాఖపట్నంలో ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా మొదటిసారి పరిచయం ఏర్పడింది. అంజన కజిన్ ద్వారా నాని, అంజన మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో నాని రేడియో జాకీగా పనిచేస్తూ సహాయ దర్శకుడిగా చిత్ర పరిశ్రమ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న రోజులవి.. అటు అంజన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఆ పరిచయమే వారి మధ్య కాలక్రమమైన ప్రేమగా మారింది.
ఇక నాని ఒకవైపు తన నటనావృత్తిని కొనసాగించడానికి హైదరాబాద్ కి వెళ్లడంతో.. ఈ జంట దాదాపు ఐదేళ్లపాటు దూరపు సంబంధాన్ని కొనసాగిస్తూ ప్రేమించుకున్నారు. ఇకపోతే అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో నాని ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ సమయంలో అంజన అతనికి అండగా నిలిచింది. 2008లో అష్టా చమ్మా చిత్రంతో నటన రంగ ప్రవేశం చేసిన నాని.. 2011లో అలా మొదలైంది చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
గుర్తింపు వచ్చిన తర్వాత తన ప్రేయసి అంజనను వివాహం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు కాస్త అంగీకరించారు. అలా 2012 అక్టోబర్ 27న విశాఖపట్నంలో కుటుంబ సభ్యులు ,సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేటు వేడుకగా చాలా సాధారణంగా వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు పెళ్లి అయిన ఐదేళ్ల కు అనగా 2017 లో అర్జున్ అనే కుమారుడు జన్మించారు.
ఇకపోతే నాని ఇండస్ట్రీలో మంచి పేరు పొందిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా.. అంజన మాత్రం బహిరంగ ప్రచారానికి ఎప్పుడూ దూరంగా ఉంటుంది . ఇక నాని ఎప్పటికప్పుడు తమ ప్రయాణాన్ని ఒక నిలకడమైన బ్లాక్ బాస్టర్ ప్రేమ కథగా అభివర్ణిస్తూ ఉంటాడు.