'ఉస్తాద్' సర్ప్రైజ్ టీజ్.. పెర్ఫెక్ట్ కమర్షియల్ బొమ్మలా ఉందే!

సినిమా పెర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్‌ గా రూపొందుతున్నట్లు టీజ్ చూస్తే క్లియర్ గా తెలుస్తోంది. హరీష్ శంకర్ తన స్టైల్‌ కు తగ్గట్లుగా పంచ్ డైలాగులు, మాస్ ఎలిమెంట్స్‌ తో సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.;

Update: 2026-03-07 17:18 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తాజాగా విడుదలైన సర్ప్రైజ్ గ్లింప్స్.. అందరినీ ఆకట్టుకుంటోంది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆ కమర్షియల్ ఎంటర్టైనర్ ఉగాది కానుకగా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ ట్రైలర్‌ కు ముందు చిన్న వీడియోను విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తి పెంచారు.

ట్రైలర్ టీజ్ పేరుతో విడుదలైన ఆ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ మాస్ స్టైల్‌లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. బ్యాక్‌ గ్రౌండ్‌లో భగవద్గీత శ్లోకాలు వినిపిస్తుండగా పవన్ చెప్పిన డైలాగ్ అభిమానులకు ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. “ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు” అంటూ ఆయన చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ గా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

సుమారు 43 సెకన్ల నిడివి ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజ్‌లో పవన్ కళ్యాణ్‌ ను పలు లుక్స్‌ లో చూపించారు మేకర్స్. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ గెటప్‌ లో ఆయన కనిపించడం ఆకట్టుకుంటోంది. లుంగీతో మాస్ స్టైల్, కౌబాయ్ క్యాప్ తో మరో స్టైలిష్ లుక్‌ లో కనిపిస్తూ ఆయన ఆకర్షించారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ఎక్కువ ఉండనున్నాయని మేకర్స్ హింట్ ఇచ్చారు.

సినిమా పెర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్‌ గా రూపొందుతున్నట్లు టీజ్ చూస్తే క్లియర్ గా తెలుస్తోంది. హరీష్ శంకర్ తన స్టైల్‌ కు తగ్గట్లుగా పంచ్ డైలాగులు, మాస్ ఎలిమెంట్స్‌ తో సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్‌ తో చేసిన గబ్బర్ సింగ్ విజయాన్ని గుర్తు చేసేలా.. మరోసారి అభిమానులను అలరించే విధంగా చిత్రం ఉండనుందని అర్థమవుతోంది.

పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, కమాండింగ్ బాడీ లాంగ్వేజ్, మాస్ డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి చిన్న గ్లింప్స్ తో మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచేశారని చెప్పాలి. ఇది కేవలం చిన్న గ్లింప్స్ మాత్రమేనని, త్వరలో విడుదలయ్యే ట్రైలర్‌ తో మరిన్ని హోప్స్ పెరుగుతాయని మేకర్స్ చెబుతున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విడుదల తేదీ ముందుకు రావడంతో చిత్రబృందం పనులను వేగవంతం చేసింది. తాజాగా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ ప్రారంభించారు. ట్రైలర్ టీజ్ కోసం ప్రత్యేకంగా ఆయనతో డబ్బింగ్ చెప్పించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ పాటలు అందించగా, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ రంగంలోకి దిగారు..

తాజాగా విడుదలైన టీజ్‌ లో తమన్ ఇచ్చిన బీజీఎం వినిపించింది. టైటిల్ కార్డ్‌ లో తమన్ స్కోర్ అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్థిబన్, కేఎస్ రవికుమార్, రావు రమేష్, రాంకీ, కేజీఎఫ్ అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.


Full View
Tags:    

Similar News