డే-1లో పైర‌సీలో 50కోట్ల మంది చూసిన సినిమా క‌లెక్ష‌న్స్ చూస్తే షాకింగ్!

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది.

Update: 2026-08-02 04:51 GMT

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే తీవ్రమైన పైరసీ బారిన పడటం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. మీడియా క‌థ‌నాల‌ ప్రకారం, డే-1లోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, మెసేజింగ్ యాప్‌లు ..ర‌క‌ర‌కాల‌ పైరసీ వెబ్‌సైట్‌ల ద్వారా దాదాపు 50 కోట్ల (500 మిలియన్లు) మంది ఈ సినిమాను డిజిటల్ మాధ్యమాల్లో వీక్షించినట్లు అంచనా. ఈ స్థాయిలో పైరసీ కంటెంట్ వైరల్ కావడం హాలీవుడ్ వర్గాల్లో పెద్ద కలకలమే రేపింది.

పైరసీ రూపంలో భారీ షాక్ తగిలినా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ స్పైడర్ మ్యాన్ మూవీ దూకుడు కొంచెం కూడా తగ్గలేదు. అమెరికాలో ఈ చిత్రం మొదటి రోజే 168 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ. 1400 కోట్లకు పైగా) వసూలు చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. డిజిటల్ మాధ్యమాల్లో పైరసీ అందుబాటులో ఉన్నా.. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు క్యూ కట్టారని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సెన్సేషనల్ ఓపెనింగ్ సాధించింది. మొదటి వీకెండ్‌లోనే భారత్‌లో దాదాపు రూ. 260 కోట్ల నుండి రూ. 320 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే దిశగా పయనిస్తోంది. ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా `అవెంజర్స్: ఎండ్ గేమ్‌` (రూ. 450 కోట్లు) రికార్డు కలిగి ఉండగా.. ఆ మార్కును దాటి భారత్‌లో తొలిసారిగా రూ. 500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టే మొదటి హాలీవుడ్ చిత్రంగా ఇది చరిత్ర సృష్టిస్తుందా అనే చర్చ ట్రేడ్ వర్గాల్లో మొదలైంది.

అయితే భారీ ఓపెనింగ్స్ వచ్చినా.. ఈ చిత్రం లాంగ్ రన్ సాధించాలంటే మొద‌టి వారం అంతా కలెక్షన్లు స్థిరంగా ఉండటం అత్యంత కీలకం. ఆరంభ వ‌సూళ్ల‌ను చూస్తుంటే ఈ చిత్రం రూ. 500 కోట్ల చారిత్రాత్మక మైలురాయిని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అంచనా.

ఇప్పటివరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీ చిత్రాలలో దాదాపు 31 సినిమాలు (లైవ్ యాక్షన్, యానిమేషన్, మార్వెల్ క్యామియోలతో కలిపి) ప్రేక్షకుల ముందుకు రాగా.. పైరసీ భూతం ఈ ఫ్రాంచైజీని ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా గడిచిన దశాబ్ద కాలంలో విడుదలైన `స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్`, `ఫార్ ఫ్రమ్ హోమ్`, `నో వే హోమ్` , యానిమేటెడ్ `స్పైడర్-వర్స్` చిత్రాలన్నీ థియేటర్లలో విడుదలైన రెండు మూడు రోజుల్లోనే హెచ్‌డీ క్వాలిటీలో పైరసీకి గురయ్యాయి. డిజిటల్ యుగంలో పైరసీని అరికట్టడం కష్టంగా మారినా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ ఇమేజ్ ముందు పైరసీ ప్రభావితం చేయలేకపోతోందని ఈ బాక్సాఫీస్ రికార్డులే నిరూపిస్తున్నాయి.

Tags:    

Similar News