ఆపుకుందామ‌న్నా ఆపుకోలేక‌పోయిన జాన్వీ చివ‌రికిలా

టాలీవుడ్ లో దేవర‌, పెద్ది సినిమాల త‌ర్వాత కోలీవుడ్ పై దృష్టి సారించింది జాన్వీక‌పూర్. అక్క‌డ త‌న మొద‌టి ప్రాజెక్ట్ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

Update: 2026-08-01 20:16 GMT

టాలీవుడ్ లో దేవర‌, పెద్ది సినిమాల త‌ర్వాత కోలీవుడ్ పై దృష్టి సారించింది జాన్వీక‌పూర్. అక్క‌డ త‌న మొద‌టి ప్రాజెక్ట్ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు దేశవ్యాప్తంగా ఉన్న‌ త‌న ఫ్యాన్స్ కోసం జాన్వీ ట్రీట్ ఆగ‌డం లేదు. అందాల భామ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కావాల్సినంతా వినోదం పంచుతున్నారు. తన లేటెస్ట్ ఫోటోషూట్లు, అవుట్‌ఫిట్లతో అభిమానులను నిరంతరం అలరించే ఈ బ్యూటీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని క్యూట్ అండ్ స్టైలిష్ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.




ఈ ఫోటోలను షేర్ చేస్తూ జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సరదా క్యాప్షన్ రాసుకొచ్చారు. నేను ఆపుకుందామనే ప్రయత్నించాను.. కానీ ఈ పిక్స్ చాలా క్యూట్‌గా ఉండటంతో పోస్ట్ చేయకుండా ఉండలేకపోయాను! అంటూ దిష్టి తగలకుండా దిష్ఠి క‌న్ను ఎమోజీని క్యాప్షన్‌గా జోడించారు. ముఖ్యంగా ఈ ఫోటోషూట్ లో ఆకుపచ్చ రంగు దుస్తుల్లో జాన్వీ మెరిసిపోతున్న తీరు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.




ఈ పోస్ట్ చూసిన సినీ సెలబ్రిటీలతో పాటు లక్షలాది మంది అభిమానులు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని కురిపిస్తున్నారు. ప్రముఖ నటి సోనమ్ బాజ్వాతో పాటు పలువురు డిజైనర్లు, శ్రేయోభిలాషులు జాన్వీ అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. బార్బీ డాళ్‌లా ఎంతో క్యూట్‌గా, ఎలిగెంట్‌గా ఉన్నారు! అంటూ ఫ్యాన్స్ క్యూట్ జాన్వీ లుక్స్‌పై ఈలలు వేస్తున్నారు.




మరోవైపు కామెంట్ సెక్షన్‌లో అభిమానుల హడావుడి మామూలుగా లేదు. చాలామంది నెటిజన్లు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ చిన్నారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సుదీర్ఘమైన మెసేజ్‌లు పోస్ట్ చేశారు. అలాగే పాపుల‌ర్ ఫ్యాన్స్ గ్రూప్స్ ల‌లో కూడా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి పోటీ పడ్డారు.

ప్రస్తుతం ఈ పోస్ట్‌కి 4 లక్షలకు పైగా లైకులు, వేల సంఖ్యలో కామెంట్లు వచ్చి చేరుతుండటంతో జాన్వీ కపూర్ పిక్స్ నెట్టింట కాక రేపుతున్నాయి. సినిమా ఆఫర్లతో ఎంత బిజీగా ఉన్నా.. ఇలాంటి సరదా ఫోటోలతో అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉండటం జాన్వీకే చెల్లిందని కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే పెద్ది త‌ర్వాత జాన్వీ క‌పూర్ న‌టించే సినిమాల‌కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

Tags:    

Similar News