హీరోల సినీ కెరియర్ ఎక్కువగా, హీరోయిన్స్ కెరియర్ కి తక్కువగా ఉండటానికి అసలు కారణం ఇదే...
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో చాలామంది హీరోలు వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో చాలామంది హీరోలు వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. నిజానికి ఇండస్ట్రీ లో స్టార్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి. ఒకటి రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోయిన కూడా వాళ్ళకి మరొక అవకాశమైతే దొరుకుతుంది. ప్రేక్షకులు సైతం తమ అభిమాన హీరోని స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. కాబట్టి హీరోలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవరికి ఉండదు. ఇక హీరోయిన్ ల విషయానికి వస్తే వాళ్ల కెరియర్ చాలా తక్కువ కాలం పాటు ఉంటుంది. వాళ్లకి ఒక సక్సెస్ వస్తే నాలుగైదు సినిమాల్లో ఆఫర్లు వస్తాయి. కానీ ఆ తర్వాత ఒకటి రెండు ఫ్లాపులతో వాళ్ళ కెరియర్ మొత్తం ముగిసిపోతుంది. ఎంత సక్సెస్ఫుల్ హీరోయిన్ అయినా కూడా వాళ్ల కెరియర్ 10 సంవత్సరాల కంటే ఎక్కువగా కొనసాగదు. ఇక హీరోయిన్లతో పోలిస్తే హీరోల కెరియర్ అనేది ఎక్కువ కాలం పాటు ఉంటుందనే చెప్పాలి.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది హీరోలు 50 సంవత్సరాల పాటు సుదీర్ఘ కెరియర్ ని కొనసాగించిన వారే కావడం విశేషం. ఏది ఏమైనా కూడా సినిమాలో హీరోలకు ఎక్కువ క్రేజ్ ఉండడానికి హీరోయిన్ల కు తక్కువ క్రేజ్ ఉండడానికి గల కారణం ఏంటి అంటే హీరోలు మొదటి నుంచి కూడా వాళ్ళ హీరోయిజాన్ని చూపిస్తూ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతూ వాళ్ళ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే పాత్రలు దొరికినా కూడా అవి వాళ్ళ కెరియర్ కి పెద్దగా ఉపయోగపడటం లేదు.
ఇక కొంత మంది దర్శకులు హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమయ్యే విధంగా వాళ్ళ క్యారెక్టర్లను తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి వాళ్లకు నటించడానికి పెద్దగా స్కోప్ అయితే దొరకడం లేదు. దీనివల్ల వాళ్లను కేవలం గ్లామర్ డాల్స్ గానే చూస్తున్నారు గాని వాళ్ళలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ఏంటి అనేది ఎవరు పట్టించుకోవడం లేదు. ఏది ఏమైనా కూడా కొంతమంది హీరోయిన్లు 20 సంవత్సరాల పాటు వాళ్ళ సుదీర్ఘ కెరియర్ ని కొనసాగిస్తున్నప్పటికి ప్రస్తుతం వాళ్ళను సీనియర్ హీరోల పక్కన హీరోయిన్లుగా నటించడానికి మాత్రమే తీసుకుంటున్నారు. యంగ్ హీరోలతో వాళ్ళు జతకట్టే అవకాశాలైతే లేకుండా పోయాయి. కానీ సీనియర్ హీరోలు మాత్రం ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లతో జత కడుతూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ అనేది హీరోల మీద డిపెండ్ అయి నడుస్తుంది.
కాబట్టే వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తుంటారు. మొత్తానికైతే హీరోలు లేకపోతే సినిమాలు లేవు. వాళ్ళను చూసే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు కాబట్టి సినిమాకి ముడి సరుకు హీరోలే అనేది వాస్తవం. కాబట్టి ప్రేక్షకులు హీరోలను పెద్ద ఎత్తున అక్కున చేర్చుకోవడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే కొందరు కెరియర్ పీక్స్ లో ఉన్నపుడే పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోవడం వల్ల కూడా కొన్ని క్యారెక్టర్ లను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దాని వల్ల కూడా వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. తద్వారా వాళ్ల సినీ కెరియర్ చాలా తొందరగా ముగుస్తుంది.