ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ లో ఉన్న ఆ ఇద్దరు ఎవరంటే!
బిగ్ బాస్ హౌజ్ లో ఈ రోజు చరణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా, ఈ వారాంతంలో ఎవరు ఎలిమినేటి అవుతారు అనే విషయం మీద ఇప్పుడు చర్చ మొదలైంది.
బిగ్ బాస్ హౌజ్ లో ఈ రోజు చరణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా, ఈ వారాంతంలో ఎవరు ఎలిమినేటి అవుతారు అనే విషయం మీద ఇప్పుడు చర్చ మొదలైంది. మొదటి వారం లో ఇప్పటికే ఇద్దర్ని ఎలిమినేటి చేసి, మళ్ళీ అందులో ఒకళ్ళని వెనక్కి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ సారి కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఇద్దరు ఎవరు అనే విషయం ఆసక్తిగా మారబోతుంది. ప్రస్తుతం ఉన్న ఆట తీరు, వోటింగ్ ట్రెండ్స్ ని బట్టి చూస్తే కృష్ణుడు మరియి స్రిష్టి డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం చరణ్ రాకతో హౌజ్ లో ఇప్పుడు 15 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో వోటింగ్ ట్రెండ్స్ లో ఆఖరి మూడు స్థానాల్లో ఉన్న వాళ్ళు వర్షిణి, స్రిష్టి, కృష్ణుడు. వర్షిణి ద్వారా అంతో ఇంతో కంటెంట్ వస్తుంది. పైగా ఆవిడ నామినేషన్స్ అప్పుడు షాలిని తో గొడవ పెట్టుకోవడమే కాకుండా కెప్టెన్సీ టాస్క్ లో కూడా ట్రిగ్గర్ చేసింది. వీరి గొడవల వల్ల వర్షిణి ఇంట్లో ఉండే అవకాశం ఉంది. ఇక మిగిలింది కృష్ణుడు మరియు స్రిష్టి.
స్రిష్టి విషయానికొస్తే ఆమె దగ్గర నుంచి వస్తున్నా కంటెంట్ చాలా తక్కువ. ఆటల్లో చురుకుగా పాల్గొనట్లేదు. అలాగే ఒక డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి వాయిస్ వినిపించిన సందర్భాలు కూడా తక్కువే. ఇక ఈ నేపథ్యంలో ఆమె అగ్ని పరీక్ష నుంచి వచ్చినా పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది అనే అనిపిస్తుంది. ఈమె బదులు అపూర్వ ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇక కృష్ణుడు విషయానికొస్తే, ఏదో మొదట్లో కాస్త హడావుడి చేసి రోహిత్ మీద అరిచినప్పటికీ అతనికి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా దొరకట్లేదు. వయసు రీత్యా కూడా అతనికి కొంచెం ఇబ్బందిగా ఉంటున్న నేపథ్యం లో అతని నుంచి కంటెంట్ కూడా రావట్లేదు కాబట్టి, కచ్చితంగా హౌజ్ వదిలి వెళ్ళిపోతాడనే అనిపిస్తుంది.
సో, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే కృష్ణుడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే కృష్ణుడు తో పాటు స్రిష్టి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.