ట్రెండ్ కోసం చేయ‌ను.. డైరెక్ట‌ర్ క‌న్విక్ష‌న్‌ను న‌మ్ముతా!

అయితే ఆ గెటప్ వెనుక ఉన్న కారణం గురించి నాని చెప్పిన మాటలు చూస్తే, ఇది కేవలం ఎక్స్‌పెరిమెంట్ కోసం చేసిన మార్పు కాదని తెలుస్తోంది.

Update: 2026-09-18 07:44 GMT

ఒక హీరో తన ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం కొన్ని డెసిష‌న్స్ తీసుకుంటాడు. కానీ కథ డిమాండ్ చేస్తే ఆ ఇమేజ్‌ను పక్కన పెట్టి పూర్తిగా కొత్తగా కనిపించేందుకు సిద్ధపడే నటులు కూడా ఉంటారు. నేచురల్ స్టార్ నాని ఇప్పుడు చేస్తున్న ది ప్యారడైజ్ విషయంలో ఇదే డిస్క‌ష‌న్ ఆసక్తికరంగా మారుతోంది. సినిమాలో ఆయన కనిపిస్తున్న జడల లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల రియాక్ష‌న్స్ వస్తున్నాయి. అయితే ఆ గెటప్ వెనుక ఉన్న కారణం గురించి నాని చెప్పిన మాటలు చూస్తే, ఇది కేవలం ఎక్స్‌పెరిమెంట్ కోసం చేసిన మార్పు కాదని తెలుస్తోంది.

సాధారణంగా ఒక హీరో లుక్ విషయంలో ఆడియ‌న్స్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందనే అంశం కూడా కీలకంగా మారుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో కొత్త గెటప్ అంటే వెంటనే మీమ్స్, ట్రోల్స్, ప్రశంసలు అన్నీ ఒకేసారి మొదలవుతాయి. నాని కూడా ఈ వాస్తవాన్ని ప్రస్తావిస్తూ, తన జడల లుక్‌పై కూడా ఇలాంటి డిస్క‌ష‌న్ జరగవచ్చని అనుకున్న‌ట్టు చెప్పారు. కానీ ఆ గెట‌ప్ ను చూసి వెంటనే ఒక అభిప్రాయానికి రావద్దని, సినిమాలో ఆ లుక్‌కు చాలా స్పెష‌ల్ రీజ‌న్ ఉందని వెల్లడించారు. ఆడియ‌న్స్ కు కనిపిస్తున్న గెటప్ వెనుక కథలో ఒక కీలకమైన అంశం దాగి ఉందని నాని మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది.

అయితే ఇక్కడ మ‌రో ఇంట్రెస్టింగ్ పాయింట్ ను కూడా నాని చెప్పారు. కేవలం ట్రెండ్ కోసం డైరెక్ట‌ర్ ఒక లుక్‌ను స‌జెస్ట్ చేస్తే తాను దానికి ఒప్పుకోనని నాని క్లారిటీ ఇచ్చారు. తనకు నచ్చిందా, ప్రస్తుతం ట్రెండ్‌లో ఉందా అనే దానికంటే డైరెక్ట‌ర్ కు ఆ గెట‌ప్ పై, మేకోవ‌ర్ పై ఎంత బలమైన నమ్మకం ఉందన్నదే తనకు ముఖ్యమని చెప్పారు. డైరెక్ట‌ర్ ఆలోచన వెనుక సరైన రీజ‌న్, కథకు అవసరమైన కన్విక్షన్ ఉంటే మాత్రం తాను ఎలాంటి మార్పుకైనా రెడీ అని నాని చెప్పారు.

ది ప్యారడైజ్ విషయంలో శ్రీకాంత్ ఓదెలపై నాని పెట్టుకున్న నమ్మకం ఈ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దసరా తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న ఈ సినిమా కోసం తనకు అలవాటైన లుక్‌ను వదిలి జడలతో కనిపించడానికి నాని సిద్ధపడటం కూడా అదే విషయాన్ని సూచిస్తోంది. శ్రీకాంత్ అంతగా నమ్మిన ఆ లుక్ వెనుక ఉన్న కథేంటన్న‌ది సినిమా రిలీజైన తర్వాతే తెలియ‌నుంది. కాగా ది ప్యార‌డైజ్ సినిమా సెప్టెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.



Tags:    

Similar News