• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భార‌తీయ న‌టులంతా...

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

| తాజాగా నటుడు రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళితో జరిగిన సంభాషణను గుర్తుచేసుకుంటూ `మహాభారతం`పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By - Srikanth Kontham
Update: 2026-11-04 07:05 GMT

దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే గుర్తుకొచ్చేది `మహాభారతం`. భారతీయ ఇతిహాసాల్లో అత్యంత సంక్లిష్టమైన.. మహోన్నతమైన ఈ కావ్యానికి దృశ్యరూపం ఇవ్వడమే తన జీవిత ఆశయమని జక్కన్న పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు తనకు ఇంకా తగినంత అనుభవం చాలదని.. ప్రపంచ స్థాయి సినిమాటిక్ అనుభవాన్ని సాధించిన తర్వాతే దీనిని ముట్టుకుంటానని కొన్నేళ్ల క్రితమే వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఇటు బిగ్ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరోవైపు మహాభారతం కోసం సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్ కొనసాగిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా నటుడు రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళితో జరిగిన సంభాషణను గుర్తుచేసుకుంటూ `మహాభారతం`పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `ఎప్పటికైనా మహాభారతాన్ని ఖచ్చితంగా తీస్తాను రాజా.. చాలా డీటెయిల్‌గా తీస్తాను. ఆ సినిమాలో ప్రతి స్టార్ ఉంటాడు. ఇండస్ట్రీలోని ప్రతి నటుడికి ఒక పాత్ర ఉంటుంది` అని రాజమౌళి తనతో అన్నారని రాజీవ్ కనకాల వెల్లడించారు.

జక్కన్న నోటి నుంచి వచ్చిన ఈ మాటలు చలనచిత్ర వర్గాల్లో.. అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తి స్తున్నాయి. మహాభారతాన్ని రెండు మూడు గంటల చిత్రంగా కాకుండా బహుళ భాగాలుగా లేదా సుదీర్ఘమైన సిరీస్ రూపంలో అత్యంత లోతుగా ఆవిష్కరించాలనేది రాజమౌళి ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం సాంకేతికంగా సరికొత్త టెక్నాలజీని, వర్చువల్ ప్రొడక్షన్ విధానాలను పరిశీలిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ , మోషన్ క్యాప్చర్.. ఏఐ వంటి నూతన సాంకేతికతలను భారతీయ స్క్రీన్‌పై ఏ విధంగా ఉపయోగించవచ్చనే దానిపై జ‌క్క‌న్న‌ బృందం ఇప్పటికే నిశ్శబ్దంగా అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది.

రాజమౌళి ఆలోచనల ప్రకారం మహాభారతం తెర‌కెక్కితే? అది పాన్-ఇండియా స్థాయి దాటి పాన్-వరల్డ్ రేంజ్‌లో ఉంటుంది. భారతీయ పరిశ్రమలో ప్రధాన నటీనటులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రతి పాత్రకూ ప్రాధాన్యతనిచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. శకుని, కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, కృష్ణుడు వంటి ప్రధాన పాత్రలతో పాటు ప్రతి చిన్న పాత్రకు కూడా ప్రతిభావంతులైన నటులను ఎంపిక చేసే ఆలోచనలో దర్శకధీరుడు ఉన్నారని తెలుస్తోంది.

ఏదేమైనా? రాజమౌళి నుంచి రాబోతున్న ప్రతి సినిమా ఆయనకు మహాభారతం తీసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని, సాంకేతిక అవగాహనను మరింత పెంపొందిస్తోంది. `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్`, ఆపై సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న అంతర్జాతీయ అడ్వెంచర్ ప్రాజెక్ట్ `వార‌ణాసి` ఇలా ప్రతి సినిమా జ‌క్క‌న్న‌ను తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఒక్కో అడుగు దగ్గర చేస్తున్నాయి.

ఈ ప్రయాణంలో సాధించే అనుభవంతోనే మహాభారత ఘట్టాన్ని ప్రపంచ సినీ చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. భారతీయ ఇతిహాస గొప్పతనాన్ని ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో అగ్ర నటీనటుల తారాగణంతో వెండితెరపై ఆవిష్కరించే ఆ అద్భుత ఘట్టం కోసం సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రాజమౌళి ఊహల్లో రూపుదిద్దుకుంటున్న `మహాభారతం` పట్టాలెక్కితే అది భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయం.

Tags:    
  • rajamouli 
  • mahabharat 
  • rajeevkanakala 
  • indianepic 
  • panworldcinema 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS