• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధర్మన్ శ్రీలీల.. ఈ...

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

| రజినీకాంత్ 'ధర్మన్' సినిమాలో శ్రీలీల కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఉండగా, ఇప్పుడు శ్రీలీలను కూడా తీసుకున్నారు.

By - M Prashanth
Update: 2026-11-04 07:05 GMT

రజినీకాంత్ 'ధర్మన్' సినిమాలో శ్రీలీల కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఉండగా, ఇప్పుడు శ్రీలీలను కూడా తీసుకున్నారు. అయితే ఇద్దరి పాత్రలు ఒకే తరహాలో ఉంటాయా, కథలో వేర్వేరు ప్రాధాన్యం ఉంటుందా అనేది ఇంకా రివిల్ చేయలేదు. శ్రీలీలను పరిచయం చేసిన గ్లింప్స్ చూస్తుంటే మాత్రం ఆమె కోసం స్పెషల్ క్యారెక్టర్‌ను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది.

శ్రీలీల అనగానే ఎక్కువగా డ్యాన్స్, ఎనర్జిటిక్ పాత్రలు గుర్తుకొస్తాయి. కానీ 'ధర్మన్' గ్లింప్స్‌లో ఆమెను కాస్త భిన్నంగా చూపించారు. అందమైన లుక్‌తో పాటు క్లాసికల్ మ్యూజిక్‌ను ఉపయోగించారు. అనిరుధ్ అందించిన సంగీతం కూడా రెగ్యులర్ మాస్ ఇంట్రడక్షన్‌కు దూరంగా ఉంది. అయితే ఆమె పాత్రలో చలాకీతనం కూడా ఉంటుందని 'స్పార్క్', 'పటాకా' అంటూ మేకర్స్ ఇచ్చిన హింట్ తో.అర్థమవుతుంది.

ఇక రజినీకాంత్ పాత్రను ఇప్పటికే పూర్తిగా వేరే విధంగా పరిచయం చేశారు. రక్తంతో తడిసిన స్కాల్పెల్ పట్టుకున్న డాక్టర్‌గా ఆయన ఫస్ట్ లుక్ వచ్చింది. 'ది డెడ్లీ డాక్టర్' అనే పేరు కూడా ఇచ్చారు. అలాంటి పాత్ర చుట్టూ నడిచే కథలో శ్రీలీల క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అవుతుందనేది ఆసక్తికరం. రెండు పాత్రల మధ్య కనెక్షన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ఒకవైపు రజినీకాంత్‌ను మిస్టీరియస్ డాక్టర్‌గా చూపిస్తూ, మరోవైపు శ్రీలీలను చలాకీ పాత్రలో పరిచయం చేస్తున్నారు. ఈ రెండు పాత్రల పరిచయాల్లో ఉన్న తేడా చూస్తే సినిమాలో ఒకే రకమైన టోన్ కాకుండా వేర్వేరు ఎమోషన్స్‌కు చోటు ఉండే అవకాశం కనిపిస్తోంది. నయనతార పాత్రను కూడా కలిపితే ప్రధాన నటీనటుల మధ్య కథ ఎలా నడుస్తుందనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారవచ్చు.

అలాగే రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్‌తో మొదటిసారి నటిస్తున్న శ్రీలలకు ఈ ప్రాజెక్ట్ మరింత స్పెషల్. ఇక కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో కూడా భాగమవ్వడం మరో బిగ్ అడ్వాంటేజ్. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమె పాత్రకు తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో ఆమెకు ఎంత స్క్రీన్ టైమ్ ఉంటుందనేది చూడాలి. ఈమధ్య కాలంలో అమ్మడికి ఇలాంటి పెద్ద అవకాశాలు రాలేదు. కాబట్టి ఇది సక్సెస్ అయితే మరో రేంజ్ కు వెళ్ళినట్లే. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న 'ధర్మన్'కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను అన్బరివ్ రూపొందిస్తున్నారు.


రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. లవ్లీ రోల్ కన్ఫర్మ్! దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆమె ప్రెజెన్స్‌ను మేకర్స్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రోమోతో అధికారికంగా ప్రకటించారు. అనిరుధ్ సంగీతం ఈ అనౌన్స్‌మెంట్‌కు మరింత ఆకర్షణగా నిలిచింది. రజినీతో శ్రీలీల స్క్రీన్ షేరింగ్ ఎలా ఉండబోతుందో చూడాలి! #Dharman #Sreeleela #Rajinikanth #AshwathMarimuthu #Tollywood #TeluguCinema #Tupaki Follow👉 @tupaki_official https://t.co/rGLBtaylPV

— Tupaki (@tupaki_official) November 4, 2026


Tags:    
  • rajinikanth 
  • sreeleela 
  • dharman 
  • tollywood 
  • kamalhaasan 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS