• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న...

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

| సినిమా ఈవెంట్లలో పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు హైలైట్ అవడం మామూలే. కానీ ఈ మధ్య ఓ బుడ్డోడు మాత్రం వాళ్ల మధ్యలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

By - M Prashanth
Update: 2026-11-04 04:20 GMT

సినిమా ఈవెంట్లలో పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు హైలైట్ అవడం మామూలే. కానీ ఈ మధ్య ఓ బుడ్డోడు మాత్రం వాళ్ల మధ్యలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అతడే ప్రజ్వల్. మొన్న 'ఆదర్శ కుటుంబం AK 47' ఈవెంట్‌లో తన స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ చిన్నోడు, ఇప్పుడు 'సమ్మర్ హాలిడేస్' కార్యక్రమంలో మరోసారి సందడి చేశాడు. ఈసారి మైక్ పట్టుకుని స్పీచ్ తోనే కాకుండా సినీ ప్రముఖుల దగ్గరికే వెళ్లి ప్రశ్నలతో వాళ్లను ఆటపట్టించాడు.

కార్యక్రమంలో స్టేజ్ కింద కూర్చున్న కిరణ్ అబ్బవరం, అల్లు అరవింద్, దర్శకుడు బాబీ దగ్గరకు వెళ్లిన ప్రజ్వల్.. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో మామిడిపండ్లు దొంగిలించారా అని అడిగాడు. కిరణ్ అబ్బవరం తాను కూడా అలాంటి పనులు చేశానని చెప్పారు. అల్లు అరవింద్ అయితే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఓ ఇంట్లో మామిడి చెట్టు చూసి, లోపలికి వెళ్లి పండ్లు కోసుకుని పరుగెత్తిన సంగతి గుర్తుచేసుకున్నారు.

ఇక బాబీ ఇచ్చిన సమాధానం మరింత సరదాగా ఉంది. దొంగతనం చేయనివాడు ఇండస్ట్రీకి రాడని, క్రియేటివిటీ ఉన్న ప్రతి ఒక్కరూ దొంగేనని నవ్వుతూ అనేశారు. ఆ తర్వాత చిన్నప్పుడు చేసిన చిలిపి పనుల గురించి ప్రజ్వల్ ప్రశ్నించాడు. అయితే ఈసారి పెద్దవాళ్లే అతడిని ఆటపట్టించడం మొదలుపెట్టారు. షూటింగ్‌లో కోయాక్టర్‌కు లైన్ వేశావా అని అడిగితే, తాను అందరినీ అక్క అని పిలుస్తానంటూ ప్రజ్వల్ సమాధానం ఇచ్చాడు.

ఇక్కడ ప్రజ్వల్ మాట్లాడిన తీరు చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలు అడగడం ఒక ఎత్తయితే, ఎదుటివాళ్లు ఇచ్చే సమాధానాలకు తగ్గట్టుగా స్పందించడం మరో ఎత్తు. ముఖ్యంగా అల్లు అరవింద్, బాబీ లాంటి సీనియర్లతో కూడా ఏమాత్రం బెరుకు లేకుండా మాట్లాడుతున్నాడు. వాళ్లు తనను ఆటపట్టించినప్పుడు కూడా వెంటనే సమాధానం ఇస్తున్నాడు.

మొన్న 'ఆదర్శ కుటుంబం' కార్యక్రమంలో ప్రజ్వల్ ఇచ్చిన స్పీచ్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఆ విషయం సినీ ప్రముఖుల నోట కూడా వినిపిస్తోంది. ఈ కార్యక్రమంలోనూ అతడి వైరల్ స్పీచ్‌ను ప్రస్తావిస్తూ పెద్దవాళ్లు సరదాగా మాట్లాడారు. అంటే ప్రజ్వల్‌ను కేవలం చైల్డ్ ఆర్టిస్ట్‌గా కాకుండా స్టేజ్ మీద మాట్లాడగలిగే బుడ్డోడిగా కూడా గుర్తుపెట్టుకుంటున్నారన్నమాట.

అయితే ప్రజ్వల్‌కు ఇప్పుడు వస్తున్న గుర్తింపు సినిమాల్లో నటన వల్ల మాత్రమే కాదు. సినిమా కార్యక్రమాల్లో తన మాటలతోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మొన్న మైక్ పట్టుకుని స్పీచ్ ఇచ్చాడు. ఇప్పుడు మైక్ తీసుకుని పెద్దవాళ్ల దగ్గరికే వెళ్లిపోయాడు. చివరికి మరో వైరల్ స్పీచ్ ఇవ్వాలంటూ వాళ్లే అడిగే పరిస్థితి వచ్చింది. ఇలా వరుస ఈవెంట్లలో హైలైట్ అవుతున్న ప్రజ్వల్ మెల్లగా పెద్దవాళ్లను కూడా డామినేట్ చేస్తున్నాడనే చెప్పాలి.


దొంగతనం చెయ్యనోడు ఇండస్ట్రీకి రాడు ! – #Bobby #SummerHolidays #SummerHolidaysOnNov6th #Rohan #ArunDev #TeluguCinema #Tupaki Follow👉 @tupaki_official https://t.co/T2Sr23aQse

— Tupaki (@tupaki_official) November 3, 2026


Tags:    
  • prajwal 
  • summerholidays 
  • tollywood 
  • alluaravind 
  • kiranabbavaram 
  • bobby 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS