• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తరుణ్ భాస్కర్.. హిట్...

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

| ఒక దర్శకుడికి మొదటి సినిమాతోనే భారీ విజయం వస్తే తర్వాత ఏం చేయాలనే ఒత్తిడి ఉంటుంది.

By - M Prashanth
Update: 2026-11-04 04:20 GMT

ఒక దర్శకుడికి మొదటి సినిమాతోనే భారీ విజయం వస్తే తర్వాత ఏం చేయాలనే ఒత్తిడి ఉంటుంది. మరింత పెద్ద హీరోతో సినిమా చేయాలా, బడ్జెట్ పెంచాలా, కమర్షియల్ కథ ఎంచుకోవాలా అనే ఆలోచనలు మొదలవుతాయి. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం 'పెళ్లిచూపులు' తర్వాత పూర్తిగా వేరే రూట్ ఎంచుకున్నారు. తన కష్టకాలంలో తోడున్న నలుగురు స్నేహితుల జీవితాలనే సినిమాగా మార్చేశారు. ఆ నిర్ణయం వెనుక ఉన్న పరిస్థితులను లేటెస్ట్ గా 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' ట్రైలర్ లాంచ్‌లో వివరించారు.

'పెళ్లిచూపులు' అంత పెద్ద హిట్ ఎలా అయిందో తనకు ఇప్పటికీ తెలియదని తరుణ్ చెప్పడం ఆసక్తికరం. సినిమా తీసేటప్పుడు వైజాగ్‌లో విజిల్స్ పడతాయని, థియేటర్లలో టికెట్లు తెగుతాయని ఊహించలేదట. కానీ ఆ విజయం తర్వాత మళ్లీ అలాంటి సినిమా చేయాలనే ఒత్తిడి మొదలైంది. అప్పటికే ఇండస్ట్రీలో తర్వాత ఎలాంటి సినిమా చేయాలో చాలామంది సలహాలు ఇస్తుండటంతో ఆ పరిస్థితి నుంచి బయటపడాలని అనుకున్నారట.

అయితే ఇక్కడ తరుణ్ చెప్పిన మరో విషయం కాస్త ఎమోషనల్‌గా ఉంది. 'పెళ్లిచూపులు'కు ముందు తాను కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది స్నేహితులు, బంధువులు దూరమయ్యారని చెప్పారు. సినిమా హిట్టయ్యాక మాత్రం మళ్లీ కనిపించారట. కానీ తన పరిస్థితి ఎలా ఉన్నా నలుగురు స్నేహితులు మాత్రం వదిలిపెట్టలేదని గుర్తుచేసుకున్నారు. వాళ్లతో ఉన్న అనుబంధాన్ని నిజాయితీగా తెరకెక్కించాలనే ఆలోచన నుంచే 'ఈ నగరానికి ఏమైంది' పుట్టిందని వివరించారు.

నిజానికి ఈ సినిమా మొదట విడుదలైనప్పుడు 'పెళ్లిచూపులు' స్థాయిలో బాక్సాఫీస్ సంచలనం సృష్టించలేదు. కానీ ఆ తర్వాత ఓటీటీ, సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా నలుగురు స్నేహితుల మధ్య కామెడీ, గొడవలు, డైలాగులు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. తరుణ్ తన వ్యక్తిగత అనుభవాల నుంచి తీసుకున్న కథే కొన్నేళ్ల తర్వాత సీక్వెల్ వరకు రావడం విశేషం.

అయితే ఇప్పుడు దర్శకుడికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి భాగం తీసేటప్పుడు 'పెళ్లిచూపులు' విజయాన్ని మళ్లీ అందుకోవాలనే ఒత్తిడి ఉంది. ఇప్పుడు మాత్రం 'ఈ నగరానికి ఏమైంది' అభిమానుల అంచనాలే పెద్ద ఛాలెంజ్‌గా మారాయి. ఇతర సినిమాలతో తనకు పోటీ లేదని, ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాల గురించే భయం ఉందని తరుణ్ స్వయంగా చెప్పారు. అందుకే ట్రైలర్‌ను కూడా పాత డైలాగులు, కామెడీతో కాకుండా కొత్తగా కట్ చేయాలని నిర్ణయించుకున్నారట.

మరోవైపు సీక్వెల్‌లో ఆ నలుగురు స్నేహితులు కాలేజీ సమస్యలను దాటి జీవితంలో మరో లెవెల్ కు చేరుకున్నారు. ఉద్యోగాలు, బాధ్యతలు, ఇండస్ట్రీలో ఎదురయ్యే కొత్త పరిస్థితులను కథలో చూపించబోతున్నారు. ఈ మార్పు తనకు 'కీడా కోలా' సమయంలో ఎదురైన అనుభవాలతో కూడా ముడిపడి ఉందని తరుణ్ చెప్పారు. మొదటి భాగంలో స్నేహితుల మధ్య సరదాను చూపించిన దర్శకుడు, ఇప్పుడు అదే స్నేహాన్ని పెద్దయ్యాక ఎదురయ్యే సమస్యలతో ఎలా కనెక్ట్ చేశారనేది ఆసక్తిగా ఉండనుంది.


నిర్మాతకు జరిగిన ఓ సంఘటనే క్లైమాక్స్ రాయడానికి నాకు స్ఫూర్తినిచ్చింది. - #TharunBhascker #ENE2 #ENERepeat #ENERepeatOnNov19th #TeluguCinema #Tollywood #Tupaki Follow👉@tupaki_official https://t.co/vaxhrgofpH

— Tupaki (@tupaki_official) November 3, 2026


Tags:    
  • tharunbhascker 
  • eenagaranikiemaindi 
  • tharunbhasckerfilms 
  • tollywood 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS