మహేష్.. ఇప్పుడు ప్లానేంటి?
ఇన్నాళ్లూ వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో ఫుల్ బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇప్పుడు కాస్త గ్యాప్ దొరికింది! అయితే ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ అసలు చర్చ మొదలైంది.
ఇన్నాళ్లూ వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో ఫుల్ బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇప్పుడు కాస్త గ్యాప్ దొరికింది! అయితే ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ అసలు చర్చ మొదలైంది. ఆ బ్రేక్ ను ఆయన ఎలా యూజ్ చేసుకుంటారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్తారా.. నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెడతారా.. అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసితో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లో ఆయనకు సంబంధించిన మెయిన్ పార్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇంకా కొంత షూట్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి పెద్దగా షూటింగ్ హడావుడి లేనట్లు తెలుస్తోంది. డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయట.
దీంతో మహేష్‌కు కొంత ఖాళీ సమయం దొరికింది. గత కొంతకాలంగా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఆయనకు ఆ గ్యాప్ కాస్త రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఇస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్లి టైమ్ స్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారనే చర్చ వినిపిస్తోంది. మహేష్ షూటింగ్ గ్యాప్ లలో ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే తరహాలో బ్రేక్ ప్లాన్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
అయితే కేవలం వెకేషన్ కే ఆ గ్యాప్ ను పరిమితం చేయకుండా.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మహేష్ బాబు ఫోకస్ పెట్టే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వారణాసి మూవీ తర్వాత ఆయన ఎవరితో తన నెక్స్ట్ ప్రాజెక్టు చేస్తారన్నది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు మహేష్ లైనప్ లో కొంతకాలంగా వినిపిస్తున్నాయి.
బుచ్చిబాబు సానా, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ పేర్లు గతంలో ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. రీసెంట్ గా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు చర్చలోకి వచ్చింది. మహేష్ బాబు కోసం భన్సాలీ ఓ పీరియాడిక్ స్టోరీని సిద్ధం చేసి నేరేట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ క్లారిటీ లేదు.
అయితే వారణాసి మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 7వ తేదీన పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కానుంది. కాబట్టి మహేష్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన విషయాలు ఇప్పుడే ఫైనల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఈ సమయంలో కథలు వినడం, దర్శకులతో చర్చలు జరపడం వంటి పనులు జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక మహేష్ నుంచి వచ్చే నెక్ట్స్ అప్డేట్ తో ఆ ప్లాన్ పై మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.