సినిమాల్లో హీరో హీరోయిన్ మెడలో నిజంగానే తాళి కడుతాడా? షూట్ అయిపోయాక ఆ తాళి ని ఏం చేస్తారు...

అందుకే సినిమాలు తీసేవారు చాలా గొప్ప వాళ్ళు అంటూ చాలా మంది వాళ్ళను పొగుడుతుంటారు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో జరిగేదంతా అబద్ధమని తెలిసినప్పటికి హీరో హీరోయిన్ ను పెళ్లి చేసుకునేటప్పుడు హీరో హీరోయిన్ మెడలో తాళి కడతాడు.

Update: 2026-09-18 02:13 GMT

అబద్ధమని తెలిసిన కూడా ఒక నటుడు తన నటనతో ప్రేక్షకులను ఏడిపించగలుగుతున్నాడు అంటే అది కేవలం సినిమా వల్లే అవుతుంది. మూడు గంటలపాటు ఎవరికి వాళ్లు వాళ్ళ బాధలను మరిచిపోయి స్క్రీన్ మీద సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. అక్కడ హీరోను ఓన్ చేసుకొని వాడు నవ్వితే నవ్వడం, వాడు ఏడిస్తే ఏడవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. నిజానికి స్క్రీన్ మీద జరిగేదంతా ఒక ఫేక్ స్టోరీ అని మనకు తెలుసు అయినా కూడా మన పర్సనల్ జీవితాన్ని దానికి రిలేట్ చేసుకొని మరి మనం బాధపడుతుంటాం. అందుకే సినిమాలు తీసేవారు చాలా గొప్ప వాళ్ళు అంటూ చాలా మంది వాళ్ళను పొగుడుతుంటారు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో జరిగేదంతా అబద్ధమని తెలిసినప్పటికి హీరో హీరోయిన్ ను పెళ్లి చేసుకునేటప్పుడు హీరో హీరోయిన్ మెడలో తాళి కడతాడు.

ఆ తాళి ఆమె మెడలో నిజంగానే కడతాడా అనే డౌట్ మనలో చాలామందికి కలుగుతూనే ఉంటుంది. నిజానికి హీరో హీరోయిన్ మెడలో తాళి కడతాడు కానీ మూడు ముళ్ళు వేయడు. మన హిందూ సంప్రదాయం ప్రకారం మూడు ముళ్ళు వేస్తేనే పెళ్లి అయినట్టు కాబట్టి వాళ్లకు పెళ్లి కానట్టే లెక్క... సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే హీరోయిన్ ఆ తాళిని తీసేసి ఆర్ట్ వాళ్లకి ఇచ్చేస్తుంది. ఇదంతా ఒక ఫేక్ పెళ్లిలా జరిగిపోతుంది. సినిమా పెళ్ళి లో పంతులు చదివే మంత్రాలు కూడా ఒరిజినల్ కాదు. కాబట్టి ఎవరికి అది నిజమైన పెళ్లి అనే ఫీల్ రాదు. ఎందుకంటే సినిమా అనేదే అబద్ధం. అందులో మనం నిజమైన పెళ్ళి ని ఎలా చేయగలం.

ఎవరికి వాళ్లు అదంతా యాక్టింగ్ అనుకోని నటిస్తూ ఉంటారు కాబట్టే వాళ్లెవరూ కూడా దాన్ని పర్సనల్ గా తీసుకోరు. ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి. వీటన్నింటిని పట్టించుకుంటు కూర్చుంటే నటీనటులు వాళ్ళ ప్రొఫెషన్ కి గుడ్ బై చెప్పాల్సిందే. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఏది జరిగినా కూడా ఎవరు దాన్ని పర్సనల్ గా తీసుకోరు. అదంతా యాక్టింగ్ పర్పస్ లో జరుగుతుంది. కాబట్టి చూసే ఆడియన్స్ సినిమాలో నటించే నటీనటులు, వాళ్ల పేరెంట్స్ అందరూ లైట్ తీసుకుంటారు.

అందువల్లే వాళ్ళు ఇన్ని రోజులపాటు ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వైవల్ కాగలుగుతున్నారు. ఒకవేళ నటి నటులతో ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం వాళ్లని తీసుకోరు. అలా ఉంటే వాళ్ళ అవకాశాలను కోల్పోవడమే కాకుండా వాళ్ళ ప్లేస్ లో మరి కొంతమంది వచ్చి వాళ్ళ ను డామినేట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు...

Tags:    

Similar News