హాలీవుడ్ ఈస్పీడ్ తో 'ఫౌజీ'కి ప్రమాదం పొంచి ఉందా?
పాన్-ఇండియా సినిమాల హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమల నుంచి వస్తోన్న భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
పాన్-ఇండియా సినిమాల హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమల నుంచి వస్తోన్న భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా ఇప్పుడీ చిత్రాలకు పోటీగా హాలీవుడ్ చిత్రాలు నిలుస్తున్నాయి. భారీ అంచనాలతో రిలీజ్ అవుతోన్న ఇంగ్లీష్ సినిమాలు ఇండియన్ స్టార్స్ కు చెమటలు పట్టిస్తున్నాయి. కొంత కాలంగా ఇండియాలో విడుదలవుతున్న హాలీవుడ్ సినిమాలు సృష్టిస్తున్న బాక్సాఫీస్ సునామి అంతా ఇంతా కాదు.
పక్కా ప్రణాళిక, భారీ ప్రమోషన్లతో అన్ని భారతీయ భాషలలో డబ్బింగ్ అవుతున్న ఇంగ్లీష్ సినిమాలు మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కే కాకుండా బీ, సీ సెంటర్లలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన `ది ఒడిస్సీ`, `స్పైడర్ మన్` వంటి విజువల్ వండర్స్ ఇండియన్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను సాధించాయి. ఇండియన్ టాప్ స్టార్స్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో హాలీవుడ్ సినిమాలు దూసుకుపోతుండటంతో టాలీవుడ్ మేకర్స్‌లో టెన్షన్ మొదలైంది.
ఈ నేపథ్యంలోనే డిసెంబర్ బాక్సాఫీస్ రేసుపై అందరి దృష్టి నెలకొంది. హాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ మూవీ `అవెంజర్స్: డూమ్స్‌డే` డిసెంబర్‌లో అత్యంత గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సరిగ్గా అదే సమయంలో టాలీవుడ్ నుంచి మోస్ట్ అవేటెడ్ మూవీస్ అయిన `ఫౌజీ` తో పాటు విజయ్ దేవరకొండ నటిస్తోన్న `రౌడీ జనార్దన` కూడా బాక్సాఫీస్ బరిలో దిగేందుకు సిద్దమవుతోంది. దీంతో ఒకే సమయంలో హాలీవుడ్ - టాలీవుడ్ దిగ్గజాలు పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది.
`అవెంజర్స్: డూమ్స్‌డే` సృష్టించబోయే మేనియా వల్ల దేశీయ సినిమాల ఓపెనింగ్స్ ..కలెక్షన్లపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా యువత .. మల్టీప్లెక్స్ ప్రేక్షకులను హాలీవుడ్ ఫ్రాంచైజీ భారీగా ఆకర్షిస్తుంది. ఇదే ప్రభావం తెలుగు సినిమాలపై పడే అవకాశం ఉంది. అయితే తెలుగు హీరోలకు ఉన్న మాస్ ఇమేజ్, ప్రాంతీయ భాషల్లో ఉండే బలమైన సెంటిమెంట్ పక్కా కంటెంట్ ఉంటే హాలీవుడ్ సునామిని కూడా తట్టుకుని నిలబడగలరు. అందులో ఎలాంటి డౌట్ లేదు. గతంలోనూ హాలీవుడ్ చిత్రాల పోటీని ఎదుర్కొని తెలుగు సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అయినా? గ్లోబల్ లెవెల్‌లో రిలీజ్ అవుతున్న భారీ చిత్రాల దూకుడును తెలుగు హీరోలు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరమే. విజయ్ ఇప్పటికే ప్లాప్ ల్లో ఉన్నాడు. తదుపరి సినిమాతో భారీ హిట్ అందుకోవాల్సిందే. లేకపోతే రేసు లో మరింత వెనుకబడే ప్రమాదం ఉంది. అలాగే ప్రభాస్ కూడా `ది రాజాసాబ్` తో ఘోరమైన ప్లాప్ ను చూసారు. ఈ నేపథ్యంలో ఫౌజీ విజయం పాన్ ఇండియాలో కీలకం కానుంది.