• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాల ఆమ‌ని స్టార్...

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

| 90లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమని.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోవడం లేదు. చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ప్రాజెక్టుల్లో సహాయక పాత్రలకే పరిమితమవుతున్నారు. టైప్ క్యాస్టింగ్ కారణంగా ఆమె ప్రతిభకు తగిన పాత్రలు దక్కడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సీరియళ్లలోనూ నటిస్తున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-11 22:30 GMT

90ల కాలంలో త‌న‌దైన సహజ నటన.. హోమ్లీ లుక్స్.. తిరుగులేని చార్మ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన అగ్ర కథానాయికలలో ఆమని ఒకరు. `శుభలగ్నం`, `శుభసంకల్పం`, `మిస్టర్ పెళ్ళాం`, `మావిచిగురు` వంటి విజ‌య‌వంత మైన‌ చిత్రాల్లో నటించి ఉత్తమ నటిగా నంది అవార్డులను అందుకుని ఓ వెలుగు వెలిగారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో ఒదిగిపోయిన ఆమ‌ని ఆ తరం స్టార్ హీరోలందరి సరసన నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక మైన ముద్ర వేసుకున్నారు. అయితే వివాహానంతరం కెరీర్ ప‌రంగా కొంత గ్యాప్ వ‌చ్చింది.

పూర్తిగా సినిమాల‌కు దూరం కాలేదు కానీ వివిధ కార‌ణాల‌తో వెండి తెర‌కు దూర‌మ‌య్యారు. అయితే మ‌ళ్లీ ఆమ‌ని సెకెండ్ ఇన్నింగ్స్ ను మ‌ళ్లీ స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజా జ‌ర్నీలో వెట‌ర‌న్ న‌టికి ఆశించిన స్థాయిలో మంచి అవ‌కాశాలు రావ‌డం లేదు. ఆమె ట్యాలెంట్ కు త‌గ్గ ఛాన్సులు వ‌స్తున్న‌ట్లు క‌నిపించ‌లేదు. చిన్న సినిమాలు.. లో-బడ్జెట్ ప్రాజెక్ట్‌లు .. సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితమవుతున్నారు. సీనియర్ నటిగా ఆమ‌ని నటన పట్ల ఉన్న తపన, పరిణతి ఇప్పటికీ తగ్గనప్పటికీ టాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాలలో సరైన డిమాండ్ కనిపించడం లేదు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటీమణులకు స్టార్ హీరోల సినిమాలలో తల్లి.. వదిన .. ప్రాధాన్యమున్న క్యారెక్టర్ రోల్స్ విరివిగా దక్కుతున్నాయి. కానీ ఆమనికి మాత్రం అగ్ర నిర్మాణ సంస్థలు ..బిగ్ లీగ్ డైరెక్టర్ల నుంచి పెద్దగా పిలుపు రాకపోవడం గమనార్హం. చిన్న సినిమాలలో తల్లి పాత్రలు .. ప్రాధాన్యమున్న సహాయ నటి పాత్రలు చేస్తున్నా? అవి పబ్లిసిటీ పరంగా ఆమ‌ని రేంజ్‌ను ఎలివేట్ చేసే స్థాయిలో ఉండటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం టాలీవుడ్ మేకర్స్ పాటించే టైప్ క్యాస్టింగ్ ..క్యారెక్టర్ రోల్స్ ఎంపిక శైలి అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రాధాన్యమున్న క్యారెక్టర్ రోల్స్ కోసం కొంతమంది సీనియర్ నటీమణులపైనే పదే పదే దృష్టి పెట్టడంతో ఆమని వంటి అవార్డు గ్రహీతల ప్రతిభకు సరిపడా ప్రాజెక్ట్‌లు దక్కడం లేదని తెలుస్తోంది. ఆమ‌ని స్థాయికి తగ్గ వైవిధ్యమైన.. బలమైన పాత్రలను డిజైన్ చేయడంలో కథకులు కూడా కొంత వెనకబడుతున్నారు. ఏదేమైనా అందాల ఆమనిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి ప్రతిభను టాలీవుడ్ స్టార్ మేకర్స్ ఉపయోగిం చుకోవాల్సిన అవసరం ఉంది. సరైన పాత్ర, బలమైన భావోద్వేగాలు ఉన్న ప్రాజెక్ట్ దక్కితే వెండితెరపై సీనియారిటీని, నటనను మరోసారి ఆమని నిరూపించుకోగలరన్న‌ది కాద‌న‌లేని నిజం. ప్ర‌స్తుతం ఆమ‌ని తెలుగు సీరియ‌ళ్ల‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    
  • aamani 
  • aamaniActress 
  • tollywood 
  • senioractress 

Similar News

పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!

2026-11-12 04:22 GMT

అనీష్ కోసం నాగ్, తారక్, చరణ్.. కారణమిదే..

2026-11-12 04:15 GMT

మోడ్ర‌న్ సినిమాలో ప‌రుచూరి శైలి పంచ్‌ల‌కు కాలం చెల్లిందా?

2026-11-12 04:15 GMT

"లైఫ్ టైం లవ్ " అంటూ పోస్ట్. గ్రీస్ అందాల మధ్య అనిరుధ్ -కావ్య దంపతులు!

2026-11-12 04:04 GMT

అనీష్ తొలి సినిమా.. రెండేళ్లకు పైగా ప్లానింగ్!

2026-11-12 04:01 GMT

రెండో ఫ్రెగ్నెన్సీ గ్లో.. కియ‌రా స్ట‌న్నింగ్ ఫోటోషూట్!

2026-11-12 03:58 GMT

తొలి సినిమాకే మాటలు లేని పాత్ర.. అనీష్ ఎంత కష్టపడ్డారంటే!

2026-11-12 03:49 GMT

వివాహం తర్వాత తొలి పోస్ట్ పంచుకున్న ప్రియా భవాని శంకర్.. జీవితంలో మరువలేని రోజంటూ!

2026-11-12 03:36 GMT

సైలెంట్ గా అర్ధరాత్రి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ మూవీ!

2026-11-12 03:31 GMT

Bigg Boss Telugu 10: హౌస్‌లో శివ - ప్రియాంక జైన్ గ్రాండ్ ఎంగేజ్‌మెంట్!

2026-11-12 03:25 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ పడింది కదా!

2026-11-12 03:23 GMT

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

Copyright @2026

Powered by Blink CMS