కొత్త పెళ్లికూతురు నైనిక‌ భావోద్వేగానికి కార‌ణం?

ముఖ్యంగా వివాహ సమయంలో నైనిక తన సాంప్రదాయబద్ధమైన అలంకరణతో అచ్చమైన తెలుగు ఇంటి కోడలిలా మెరిసిపోయారు.;

Update: 2026-03-07 16:45 GMT

అల్లు శిరీష్ - నైనికల వివాహ వేడుక మార్చి 6న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో అత్యంత భావోద్వేగపూరితమైన ఘట్టం ఏదైనా ఉందంటే అది నవవధువు నైనిక తన తాతగారైన దివంగత డి. శరత్ చంద్రారెడ్డి గారిని స్మరించుకోవడం. తన జీవితంలోని అతిపెద్ద వేడుకలో తాతయ్య లేని లోటును తలుచుకుంటూ నైనిక షేర్ చేసిన ఫోటోలు, ఎమోషనల్ సందేశం అతిథులను అభిమానులను కంటతడి పెట్టించాయి.

ఈ సందర్భంగా అల్లు శిరీష్ కూడా తన మామగారిని ఉద్దేశించి ఎంతో హృద్యంగా స్పందించారు. నా మామగారు డి. శరత్ చంద్రారెడ్డి గారిని కలిసే అవకాశం నాకు లభించలేదు. కానీ ఈ రోజు నా భార్యగా పిలుచుకుంటున్న ఇంతటి గొప్ప వ్యక్తిని పెంచి పెద్ద చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ప్రారంభించిన ఆ ప్రేమను నా జీవితాంతం ముందుకు తీసుకెళ్తాను! అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఒక కొత్త బంధం ప్రారంభమైన వేళ పెద్దల పట్ల వారు చూపిన ఈ గౌరవం అభినందనీయం.

కొత్త పెళ్లికూతురుగా నైనిక రూపం ఈ వేడుకలో ఒక దేవకన్యను తలపించింది. వ‌ధువు ధరించిన బంగారు వర్ణపు కంచి పట్టుచీర, దానికి జతగా మెడలో ధరించిన భారీ వజ్రాల హారాలు త‌న‌కు రాజసం, నిండుదనాన్ని తీసుకువచ్చాయి. నైనిక మేకప్ .. హెయిర్ స్టైల్ కూడా ఎంతో సహజంగా ఉంటూ త‌న‌ సహజ సౌందర్యాన్ని మరింతగా పెంచాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ నైనిక తన చిరునవ్వుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ముఖ్యంగా వివాహ సమయంలో నైనిక తన సాంప్రదాయబద్ధమైన అలంకరణతో అచ్చమైన తెలుగు ఇంటి కోడలిలా మెరిసిపోయారు. ఆమె కళ్ళలో కనిపిస్తున్న ఆనందం.. కాస్తంత బెరుకు కలగలిసిన భావాలు ఫోటోగ్రాఫర్ల కెమెరాల్లో అద్భుతంగా బంధించడం విశేషం. అల్లు వారి కోడలిగా నైనిక ప్రవేశం ఆ కుటుంబంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు.

ఇక ఈ కొత్త జంట తమ హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్తున్నారనే విషయంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వారు ఏదైనా విదేశీ విహారయాత్రకు వెళ్తారా లేక స్వదేశంలోనే ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకుంటారా అని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

శ‌ర‌త్ చంద్రారెడ్డి గురించి..

నవవధువు నైనిక రెడ్డి తాతగారైన దివంగత డి. శరత్ చంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన పారిశ్రామికవేత్త .. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. ఆయన ప్రధానంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొనేవారు. తన దూరదృష్టితో వ్యాపార రంగంలో అనేక మందికి ఉపాధి కల్పించి, ఒక విజయవంతమైన బిజినెస్ మేగ్నెట్‌గా గుర్తింపు పొందారు.

వృత్తిపరంగా ఆయన ఎంతో క్రమశిక్షణతో కూడిన పారిశ్రామికవేత్తగా ఉండేవారు. ఆయన స్థాపించిన సంస్థలు అనేక భారీ ప్రాజెక్టులను నిర్మించి విశ్వసనీయతను సంపాదించుకున్నాయి. తన వ్యాపార లావాదేవీల ద్వారా అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు పారిశ్రామిక వర్గాల్లోనూ ఆయనకు మంచి గౌరవం ఉండేది. నైనిక రెడ్డి తన వివాహ వేడుకలో తాతయ్యను అంతగా స్మరించుకోవడానికి కారణం ఆయన కుటుంబానికి అందించిన విలువలు, వారు సాధించిన ఘనతలే అని చెప్పవచ్చు.

Tags:    

Similar News