రామాయణం ట్రైలర్.. ఇంతకీ రెస్పాన్స్ ఎలా ఉంది?

బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణం పార్ట్ 1 ట్రైలర్ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Update: 2026-07-30 10:02 GMT

బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణం పార్ట్ 1 ట్రైలర్ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన ఆడియన్స్ నుంచి ఒకే రకమైన పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. కొంతమంది నెటిజన్లు ఈ ట్రైలర్ ను మెచ్చుకుంటుంటే ఇంకొందరు మాత్రం పలు విషయాల్లో తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. ఓవరాల్ గా ఈ ట్రైలర్ మీద నెట్టింట మిక్స్డ్ రియాక్షన్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

ఈ ట్రైలర్ చూసిన తర్వాత నెటిజన్ల మధ్య ముఖ్యంగా రణబీర్ కపూర్, యష్ ల గురించే పెద్ద చర్చ నడుస్తోంది. పవర్ ఫుల్ విలన్ రోల్ లో పాన్ ఇండియా స్టార్ యష్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని కామెంట్స్ వస్తున్నాయి. రాముడిగా రణబీర్ కపూర్ లుక్ బాగానే సెట్ అయినప్పటికీ యష్ మాత్రం రావణ్ గా తన ఆటిట్యూడ్ తో రణబీర్ ను పూర్తిగా డామినేట్ చేశాడనే టాక్ నడుస్తోంది. ఒక అహంకారం ఉన్న లంక రాజుగా యష్ గెటప్ ఈ ప్రొమోకే హైలైట్ గా నిలిచిందని చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఇక ఈ ప్రాజెక్ట్ లో సీతమ్మ పాత్రలో నటించిన సాయి పల్లవి విషయానికి వస్తే ఆడియన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సినిమాటిక్ గా కాకుండా ఎంతో సహజంగా ఉన్న ఆమె లుక్ ఈ క్యారెక్టర్ కు కరెక్ట్ గా సరిపోయిందని ఒక వర్గం ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. దానికి భిన్నంగా ఇంకొందరు మాత్రం ఇంత భారీ సినిమాలో సీత క్యారెక్టర్ కు ఆమె అంతగా సెట్ కాలేదని ఓపెన్ గానే చెబుతున్నారు. ఇలా ఆమె కాస్టింగ్ పైన సోషల్ మీడియా వేదికగా రెండు రకాల వాదనలు కనిపిస్తున్నాయి.

ఈ ట్రైలర్ లో చాలామంది అభిమానులు ఫీల్ అయిన మరో ప్రధానమైన లోపం హనుమంతుడి క్యారెక్టర్ కనిపించకపోవడం. రామాయణం లాంటి ఇతిహాసంలో అత్యంత కీలకమైన హనుమాన్ పాత్రను ఈ ఫస్ట్ ప్రొమోలో ఎక్కడా రివీల్ చేయలేదు. వానర సైన్యాన్ని చూపించిన మేకర్స్ ఆ మహా భక్తుడిని మాత్రం దాచిపెట్టడం కొంత నిరాశకు గురిచేసింది. ఆ ఎంట్రీ లేకపోవడంతో ఈ వీడియో చూస్తున్నంత సేపు ఏదో ఇన్ కంప్లీట్ గా ఉందనే ఫీలింగ్ కలుగుతోందని నెటిజన్లు మేకర్స్ కు తమ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.

సినిమా టెక్నికల్ వాల్యూస్ పైన కూడా ఇలాంటి డివైడ్ టాకే నడుస్తోంది. ఇంటర్నేషనల్ స్టూడియోస్ తో కలిసి వేల కోట్ల బడ్జెట్ తో తీస్తున్న సినిమా కావడంతో జనాలు విజువల్స్ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ట్రైలర్ లోని గ్రాఫిక్స్ వీఎఫ్ఎక్స్ వర్క్ కొందరికి నచ్చితే ఇంకొందరికి మాత్రం అంచనాలకు తగ్గట్లుగా లేవనిపిస్తోంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం లేదు. రెహమాన్ సంగీతం బాగున్నా ఇంకా బెటర్ గా ఉండాల్సిందనే కామెంట్స్ వస్తున్నాయి.

ఒక భారీ పౌరాణిక కథను సినిమాగా తీసుకువస్తున్నప్పుడు జనాల్లో అంచనాలు మామూలుగా ఉండవు. ఇలాంటి ప్రాజెక్ట్ కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా దానిపై ప్రతి ఒక్కరూ తమ సొంత కోణంలో గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు రామాయణం ట్రైలర్ పై వస్తున్న ఈ మిక్స్డ్ రియాక్షన్స్ కూడా అందులో భాగమే అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కేవలం ఒక చిన్న వీడియో చూసి సినిమా రిజల్ట్ ను అంచనా వేయలేము. పూర్తి స్థాయి సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్ట్ అసలు స్థాయి ఏంటో అర్థమవుతుంది.

Full View
Tags:    

Similar News