• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయేంద్ర ప్రసాద్.. ఏం...

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

| రాజమౌళి సినిమాల్లో హీరోలు, విజువల్స్ ఎంత హైలైట్ అవుతాయో కథలు కూడా అంతే కీలకం. ఆ కథల వెనుక విజయేంద్ర ప్రసాద్ ఉన్నారనే సంగతి తెలిసిందే.

By - M Prashanth
Update: 2026-11-04 01:30 GMT

రాజమౌళి సినిమాల్లో హీరోలు, విజువల్స్ ఎంత హైలైట్ అవుతాయో కథలు కూడా అంతే కీలకం. ఆ కథల వెనుక విజయేంద్ర ప్రసాద్ ఉన్నారనే సంగతి తెలిసిందే. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' లాంటి భారీ విజయాల తర్వాత దేశవ్యాప్తంగా ఆయనకు మంచి డిమాండ్ ఏర్పడింది. కానీ ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలతో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య మాత్రం తక్కువగానే కనిపిస్తోంది. మరి ఇంత డిమాండ్ ఉన్న రచయిత కథలు ఏమవుతున్నాయనే డౌట్ రాకుండా ఉండదు.

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి'కి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాలో పురాణాలతో పాటు టైమ్ ట్రావెల్ అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రాముడు, కుంభకర్ణుడి మధ్య జరిగే యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్ గురించి విజయేంద్ర ప్రసాద్ గతంలోనే చెప్పారు. ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు 'వారణాసి' ఏప్రిల్ 7న కచ్చితంగా విడుదలవుతుందని కూడా చెప్పారు.

అయితే రాజమౌళి సినిమాలకే పరిమితం కాకుండా ఇతర దర్శకులకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథలు అందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ 'బజరంగీ భాయిజాన్ 2' కోసం కథ సిద్ధం చేసినట్లు గతంలో నిర్మాత కేకే రాధామోహన్ ప్రకటించారు. అలాగే 'విక్రమార్కుడు 2' కథ కూడా రెడీగా ఉందని చెప్పారు. కానీ ఈ రెండు సీక్వెల్స్ ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. ముఖ్యంగా సల్మాన్ సినిమా విషయంలో చాలాకాలంగా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

మరోవైపు బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఓ భారీ ప్రాజెక్టుకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ధనుష్ హీరోగా, పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో పురాణాల నేపథ్యంతో కూడిన జంగిల్ అడ్వెంచర్ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కథ విజయేంద్ర ప్రసాద్‌దేనని మిత్రన్ స్వయంగా చెప్పారు. అయితే ప్రాజెక్టు ఇంకా ఫైనల్ కాలేదని, సంప్రదింపులు జరుగుతున్నాయని కూడా వెల్లడించారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే విజయేంద్ర ప్రసాద్ కథలకు డిమాండ్ ఉన్నప్పటికీ వాటిని సినిమాలుగా మార్చడంలో ఆలస్యం జరుగుతోంది. ముఖ్యంగా పెద్ద హీరోల డేట్స్, దర్శకుల కమిట్‌మెంట్స్, భారీ బడ్జెట్లు వంటి అంశాలు కుదరాలి. 'బజరంగీ భాయిజాన్'తో బాలీవుడ్‌లోనూ భారీ విజయం అందుకున్న ఆయనకు మరో హిందీ సినిమా రావడానికి ఇంత సమయం పడుతుండటం విశేషం. ఇప్పటికే సిద్ధమైన సీక్వెల్ కథలు కూడా ముందుకు కదలడం లేదు.

ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ పేరు మీద అత్యంత కీలకమైన ప్రాజెక్టు 'వారణాసి'. మరోవైపు ధనుష్ సినిమా కూడా ఖరారైతే రాజమౌళితో సంబంధం లేకుండా మరో భారీ చిత్రానికి ఆయన కథ అందించినట్లవుతుంది. అయితే 'విక్రమార్కుడు 2', 'బజరంగీ భాయిజాన్ 2' విషయంలో ఇప్పటివరకు కాస్టింగ్, షూటింగ్‌కు సంబంధించిన స్పష్టమైన అప్‌డేట్స్ లేవు. కథలు సిద్ధంగా ఉన్నా వాటిని తెరపైకి తీసుకొచ్చే హీరోలు, దర్శకుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

Tags:    
  • vijayendraprasad 
  • ssrajamouli 
  • varanasi 
  • maheshbabu 
  • dhanush 
  • vikramarkudu2 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS