పూరి కెరీర్ లో లాంగ్ గ్యాప్ ఇదేనేమో!

ప్రస్తుతం పూరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `స్లమ్ డాగ్` షూటింగ్ , నిర్మాణ కార్యక్రమాలు అత్యంత మందకొడిగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ వివిధ కారణాల వల్ల నత్తనడకన సాగుతూ వస్తోంది.

Update: 2026-07-30 10:30 GMT

టాలీవుడ్ లో అత్యంత వేగంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా పూరి జగన్నాథ్ ప్రత్యేకమైన పేరుంది. చాలా మంది ద‌ర్శ‌కులు సినిమా పూర్తి చేయడానికి సంవత్సరాల తరబడి సమయం తీసుకుంటే పూరి మాత్రం ఆరు నెలల్లోనే స్క్రిప్ట్ పూర్తి చేసి థియేటర్లోకి తీసుకురాగల సత్తా ఉన్న మేకర్. ఆయన సినిమాల స్పీడ్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతుండేవి. అయితే స్పీడ్ విష‌యంలో కొన్ని హెచ్చరిక‌లు రావ‌డంతో? `డ‌బుల్ ఇస్మార్ట్ శంక‌ర్` నుంచి స్పీడ్ తగ్గించి ప‌నిచేస్తాన‌ని ప్రామిస్ చేసారు. ఆ సినిమాకు అలాగే ప‌నిచేసారు.

ఎంతో గ్రౌండ్ వ‌ర్క్ చేసి స‌మ‌యం తీసుకుని ఆ చిత్రాన్ని రిలీజ్ చేసారు. కానీ ఫ‌లితం మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. దీంతో పూరి ఇలా నెమ్మ‌దిగా ప‌ని చేయ‌డం కంటే? పాత ప‌ద్ద‌తిలోనే ముందుకెళ్లాల‌ని భావించారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే పూరి వేగం పూర్తిగా మందగించినట్లు క‌నిపిస్తుంది. పూరి జగన్నాథ్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇంత భారీ గ్యాప్ తీసుకుని ఇన్ని వాయిదాల తర్వాత విడుదలవుతున్న దాఖలాలు లేవు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత సుదీర్ఘమైన గ్యాప్‌గా ట్రేడ్ పండితులు అభివర్ణిస్తున్నారు.

ప్రస్తుతం పూరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `స్లమ్ డాగ్` షూటింగ్ , నిర్మాణ కార్యక్రమాలు అత్యంత మందకొడిగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ వివిధ కారణాల వల్ల నత్తనడకన సాగుతూ వస్తోంది. రిలీజ్ కు సంబంధించి అధికారిక అప్‌డేట్లు రాకపోవడంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఒకప్పుడు ఏడాదికి రెండు సినిమాలు ఇచ్చే దర్శకుడు ఇప్పుడు ఒక సినిమాను పూర్తి చేయడానికి సుదీర్ఘ సమయం తీసుకోవడం పూరి కెరీర్‌లోనే తొలిసారి అని చెప్పొచ్చు.

అయితే ఈ లాంగ్ గ్యాప్ వెనుక పూరి ప్లానింగ్ గట్టిగానే ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. వరుస ఫ్లాప్‌ల నుంచి బయటపడాలంటే వేగమే కాకుండా పక్కా కంటెంట్ ముఖ్యం అని గ్ర‌హించిన‌ట్లు తెలుస్తోంది. `స్లమ్ డాగ్` చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏ చిన్న లోపం లేకుండా తెర‌కెక్కించాల‌నే సంక‌ల్పంతో ఇంత‌ సమయాన్ని తీసుకుంటున్నారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద త‌న సత్తా ఏంటో నిరూపిం చుకోవాలని కసిగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే పూరి జగన్నాథ్ కెరీర్‌లో ఇంతటి లాంగ్ గ్యాప్ రావడమనేది అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నా? ఈ విరామం సినిమా అవుట్‌పుట్‌ను మాత్రం అద్భుతంగా మారుస్తుందని ఆశిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న స్లమ్ డాగ్ పూరి గ‌త పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాలని ప్రేక్ష‌కాభిమానులు కోరుకుంటున్నారు. స్పీడ్ కాదు సక్సెస్ ముఖ్యం అనే నినాదంతో పూరి రీఎంట్రీ ఉండాల‌ని ఆశీస్తున్నారు.

Tags:    

Similar News